అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి | Three Maoists Died In Andhra Pradesh Exchange Of Fire, More Details Inside | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Jun 18 2025 10:54 AM | Updated on Jun 18 2025 11:05 AM

Three Maoists Death in Andhra Pradesh Exchange of fire

సాక్షి, అల్లూరి: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉదయ్ మృతి ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement