12 మంది మావోయిస్టులు లొంగుబాటు | 12 Maoists Surrender Before Kothagudem SP In Police Station, More Details Inside | Sakshi
Sakshi News home page

12 మంది మావోయిస్టులు లొంగుబాటు

Jun 19 2025 4:12 PM | Updated on Jun 19 2025 5:06 PM

12 Maoists Surrender Before Kothagudem Police Station

కొత్తగూడెం: వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్‌ అవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఆరు నెలల్లో 294 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

కాగా,  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కీలక నేతలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్‌ బల గాలు కూంబింగ్‌ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి.

ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్‌ గణేష్, అలియాస్‌ ఉదయ్, అలి యాస్‌ బిర్సు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్‌ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. 

Advertisement
 
Advertisement
Advertisement