తిరుపతి ఎట్లున్నడో?.. తిరుపతి ఎట్లున్నడో?.. | Thippiri Tirupathi alias Devuji is an Indian Maoist leader | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎట్లున్నడో?.. తిరుపతి ఎట్లున్నడో?..

May 25 2025 10:01 AM | Updated on May 25 2025 10:01 AM

Thippiri Tirupathi alias Devuji is an Indian Maoist leader

సీనియర్‌ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌  సారధి

తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ  తల వెల రూ. కోటి 

పశ్చిమ బెంగాల్‌ సరిహద్దుల్లో మకాం?

వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కలవరం 

కోరుట్ల(కరీంనగర్): మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సెంట్రల్‌ మిలిషియా కమిషన్‌ మెంబర్‌..మావోల కీలక దాడుల్లో వ్యూహకర్త.. మావోయిస్టు పార్టీలో సెకండ్‌ క్యాడర్‌లో ఉన్న కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఉరఫ్‌ దేవ్‌జీ ఎట్లున్నడో.. అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్న విషయం తెల్సిందే. అయితే  ఎన్‌కౌంటర్‌లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు. 

ఆర్‌ఎస్‌యూ నేపథ్యమే..
కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్‌ క్యాడర్‌ హోదాలో పనిచేస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్‌ రిజర్వ్‌ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్‌ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.

ఎక్కడున్నడో ఏమో? 
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్‌ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్‌ తీసుకుంటున్నట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ భావిస్తోంది.

వీరిలో తిప్పిరి తిరుపతి కూడా ఉంటాడన్న ప్రచా రం జరుగుతోంది. ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందుతున్న క్రమంలో తిరుపతి ప్రస్తావన రావడం గమనార్హం. ఇటీవల మెట్‌పల్లి డీఎస్పీ అ డ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వె ళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని  లొంగిపోయేలా చూ డాలని ఆయన బంధువులను కోరడం గమనార్హం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement