Nambala Keshava Rao: శ్రీకాకుళం టు సుప్రీం కమాండర్‌ | Top Maoist Leader Nambala Keshava Rao Lost His Life In Police Encounter, More Details Inside | Sakshi
Sakshi News home page

Nambala Keshava Rao: శ్రీకాకుళం టు సుప్రీం కమాండర్‌

May 22 2025 9:33 AM | Updated on May 22 2025 10:27 AM

Top Maoist leader Nambala Keshava Rao Lost His Life In Police Encounter

నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు హతం 

సొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్‌ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస: నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యారి్థగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోట»ొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్‌గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్‌ నౌపడ ఆర్‌ఎస్‌లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్‌లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. 
  
ఉద్దానంలో.. 
నంబాళ్ల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్‌ వార్‌ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్‌ వార్‌లో, నేటి మావోయిస్టు పారీ్టలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు.  

ఎన్‌కౌంటర్‌కు ఖండన 
చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ మఢ్‌ అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ను సి.పి.ఐ.ఎం.ఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు.  

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement