రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. తాజాగా సుక్మా జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కరిగుండం అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశ ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.


