
రాయ్‌పూర్: వివిధ కేడర్‌లకు చెందిన 100కు పైగా మావోయిస్టులు.. పోలీసులకు లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు తమకు సరెండర్ అయినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
గురువారం( అక్టోబర్ 1వ తేదీ) తాము లొంగిపోతున్నట్లు తెలిపిన మావోయిస్టులు.. పారామిలటరీ అధికారులు, సీనియర్ పోలీసులు సమక్షంలో వీరు లొంగిపోయారు. ఆ మేరకు ఆయేధాలను విడిచిపట్టి సాధారణ సంఘ జీవితంలో కలిసి బ్రతకడానికి సిద్ధమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
లొంగిపోయిన వారంతా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారే ఉన్నారని, వారు చేపట్టిన ఉద్యమాన్ని వదిలి సంఘ జీవితంలో కలిసే బ్రతుకుతామంటూ లొంగిపోయినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.