
ఇప్పటి వరకు ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు లభ్యం
బీజాపూర్ జిల్లా నైరుతి ప్రాంతంలోని మంకేలి అడవుల్లో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. వీరిపై రూ.7 లక్షల రివార్డు ఉంది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా-202, 205 బెటాలియన్ సంయుక్త బృందం ఈ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
గురువారం మధ్యాహ్నం ౩ గంటల సమయంలో బలగాలు కూంబింగ్‌లో ఉండగా.. నక్సల్స్ తారసపడ్డారని, ఆ వెంటనే కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆత్మ రక్షణ కోసం బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరికొందరు అడవుల్లోకి పారిపోయినట్లు వివరించారు. వారికోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. మృతిచెందిన నక్సల్స్ వద్ద ఒక 303 రైఫిల్, ఒక బీజీఎల్ లాంఛర్, మూడు బీజీఎల్, నాలుగు లైవ్ రౌండ్లు, బ్యాటరీ కార్డెక్స్ వైర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.