సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో 36 సంవత్సరాలుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్; 35 సంవత్సరాలుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ రాజు; 21 సంవత్సరాలు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న తోడెం గంగా అలియాస్ సోనీ ఉన్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకటయ్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కింద దక్షిణ బస్తర్ డివిజన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా , కార్యదర్శిగా పనిచేశారు. అతని భార్య కోడి మంజుల అలియాస్ నిర్మల ఏడాది క్రితం వరంగల్‌లో లొంగిపోయారు.
వారి లొంగిపోవడం మావోయిస్టు నెట్‌వర్క్‌ను బలహీనపరచడంతో పాటు ఇతర మావోయిస్టులు జీవన స్రవంతిలోకి తిరిగి రావడానికి దోహదపడటంలో మరో అడుగు అని పోలీసు అధికారులు తెలిపారు.


