
ముంబై: మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఓ కుదుపేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టు అగ్రనేత ఆశన్న (వాసుదేవ్ రావు) నేతృత్వంలోని 70 మంది మావోయిస్టులు జగదల్‌పూర్ చేరుకుని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు ధృవీకరిస్తున్నాయి. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు. డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బుధవారం ఉదయం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత మేధావి, ఆలోచన పరుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మల్లోజులతో పాటు ఆయన నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే.