వరంగల్: మావోయిస్టుల్లో చేరిన తన కొడుకు లొంగిపోయాడని ఈనెల 4వ తేదీన పోలీసులు చెప్పి 20 రోజులు దాటినా ఆచూకీ లేదని వరంగల్ నగరం లేబర్ కాలనీకి చెందిన పోలేపాక సులోచన తెలిపింది. ఆమె సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఐదుగురు సంతానమని, అందులో నాలుగో కొడుకు పోలేపాక సునీల్ 27 ఏళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడని పేర్కొంది. కొన్ని నెలల తర్వాత పోలీసులు వచ్చి తన కొడుకు అడవి బాట పట్టి మావోయిస్టుల్లో చేరాడని చెప్పడంతో భయపడిపోయామని చెప్పింది.
తరచూ తమ ఇంటికి పోలీసులు వచి్చపోతూ బిడ్డ వస్తున్నాడా...లేదా అంటూ విచారించేవారని పేర్కొంది. భర్త చనిపోయినప్పుడు కూడా కొడుకు రాలేదని, ఈనెల 4న వరంగల్ నుంచి ఒకరు, హైదరాబాద్ నుంచి మరొకరు వచ్చి.. సునీల్ లొంగిపోయాడని సమాచారం అందించినట్లు తెలిపింది. లొంగిపోయాడని చెప్పడంతో ఎంతో సంతోíÙంచానని, వృద్ధాప్యంలో ఉన్న తనకు కొడుకు ఆసరాగా ఉంటాడని ఆశపడ్డానని పేర్కొంది. కానీ, 20 రోజులు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా ఉందని తెలిపింది. తన కొడుకు విషయమై ఎవరిని సంప్రదించాలో తెలియదని, ఎక్కడున్నాడో పోలీసులు చెప్పాలని ఆమె కన్నీటిపర్యంతమైంది.


