జిల్లాలో మరో ఎౖకై ్సజ్ పోలీస్‌స్టేషన్
ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్‌లో సోమవారం పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో స్థానిక స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్, నాగరాజు పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు.యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.నకిలీ మద్యం తయారీపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దుర్గాభవాని స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, అర్బన్ డీపీఓ చంద్రశేఖర్, ఎకై ్సజ్ సీఐ దుర్గాభవాని, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, దేవస్థాన చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, మాజీచైర్మన్ జె.రవి, పుల్లా రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీసర్పంచ్ అనిల్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, దేవస్థాన ధర్మకర్త సురేశ్,మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


