విస్తరణేది
సాక్షి, వరంగల్: వర్షాకాలం వచ్చిదంటే చాలు వరంగల్‌లో వరదలు పరిపాటి అయ్యాయి. ఇటీవల ముంచెత్తిన మోంథా తుపానుతో జరిగిన నష్టం అపారంగానే ఉంది. కళ్ల ముందు ఇన్నీ కదలాడుతు న్న రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తున్నామంటూ చెబుతున్న అధికార కాంగ్రెస్ పా ర్టీ నాయకులు కుడా పరిధిని విస్తరించాలని నిర్ణయించినా ఇంతవరకు పట్టాలెక్కేలా చూడడం లే దు. కుడా పరిధి విస్తరణతో వందలాది గ్రామాలు, పదుల సంఖ్యలో మండలాల్లో రోడ్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, పార్కులు, కరెంట్.. మౌలిక వసతులు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి.
పరిధి పెంచితే మంచిదే..
కుడా పరిధిని పెంచడం ద్వారా ఆయా గ్రామాలు, మండలాలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోకి వస్తాయి. ఫలితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) ద్వారా కేంద్రం అందించే సాయం రెట్టింపయ్యే అవకాశముంటుంది. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంత యూనిట్ కాస్ట్ రూ.72 వేలు ఉండగా, పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ 1.5 లక్షలుగా కొనసాగుతోంది. అయితే కుడా విస్తరణ ద్వారా వందల సంఖ్యల గ్రామ పంచాయతీలు పట్టణ పరిధిలోకి చేరతాయి. దీంతో వీటిని పట్టణ ప్రాంత యూనిట్ కాస్ట్ ప్రకారం నిధులు అందే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల నిధుల విషయంలో రూ.కోట్లలో అదనపు భారం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అనధికారిక లేఔట్‌లను నియంత్రించడం ద్వారా ప్రభుత్వ ఖజానా మెరుగుపడే అవకాశం ఉంటుంది. బృహత్ ప్రణాళిక అమలులో ఉండి ఈ ప్రాంతాలన్నీ పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతాయి. వరదలొచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అక్కడా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఏయే ప్రాంతాలున్నాయంటే...
అభివృద్ధికి ‘కుడా’ విస్తరణ ప్రతిపాదనలు
ఏడాది దాటినా ప్రభుత్వం వద్దనే ఫైల్
పట్టించుకోని స్థానిక నేతలు
‘కుడా’ పరిధి పెంచాలంటున్న జనం
ఇది జరిగితే ‘ఇందిరమ్మ’ పథకంలో
తగ్గనున్న భారం
అనధికారిక లేఔట్లు తగ్గి
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అవకాశం
ప్రస్తుతం ‘కుడా’ పరిధి: 1,805 చ.కిలోమీటర్ల ప్రతిపాదించిన పరిధి: 2,738.19 చ.కిలోమీటర్లు
జిల్లా పరిధిలోని దుగ్గొండి మండలంలోని 11 గ్రామాలు, నర్సంపేట మండలంలోని ఎనిమిది గ్రామాలు, వర్ధన్నపేట మండలంలోని 11 గ్రామాలు, పర్వతగిరి మండలంలోని 9 గ్రామాలు, సంగెం మండలంలోని మూడు గ్రామాలు ఉన్నాయి.
హనుమకొండ జిల్లా పరిధి శాయంపేట మండలంలోని ఎనిమిది గ్రామాలు, భీమదేవరపల్లి మండలంలోని ఎనిమిది గ్రామాలు, నడికూడ మండలంలోని ఏడు గ్రామాలు, పరకాల మండలంలోని ఏడు గ్రామాలు, ఆత్మకూరు మండలంలోని నాలుగు, ఐనవోలు మండలంలో మూడు గ్రామాలున్నాయి.
జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రెండు గ్రామాలు, జఫర్‌గడ్ మండలంలోని తొమ్మిది గ్రామాలున్నాయి. ఈ మూడు జిల్లాలో పరిధి మొత్తం కలుపుకుంటే 933.19 చదరపు కిలోమీటర్లుగా ఉంది. కాగా, కుడా పరిధిని విస్తరిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుంది.
విస్తరణేది


