జీవన ప్రమాణాల మెరుగే కాంగ్రెస్ ధ్యేయం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ఆత్మకూరు: ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుడెప్పాడ్‌లో సోమవారం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.12 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మహిళల అభివృద్ధి కోసం డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుడెప్పాడ్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. గుడెప్పాడ్ సమీపంలో కెనాల్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బీరం సునంద సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ సర్పంచ్ ఉడుత మహేందర్, శ్రీనివాస్‌రెడ్డి, రేవూరి జయపాల్‌రెడ్డి, బండి శ్రీనివాస్, అలువాల రవి, గఫూర్, పీఆర్ అధికారులు పాల్గొన్నారు.


