‘ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?’ | No Discussion With Maoists Union Minister Bandi Sanjay | Sakshi
Sakshi News home page

‘ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?’

May 5 2025 3:57 PM | Updated on May 5 2025 6:01 PM

No Discussion With Maoists Union Minister Bandi Sanjay

పెద్దపల్లి:  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదనే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,  తెలంగాణ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని సంజయ్ ప్రశ్నించారు.  ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు.

‘కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. మావోయిస్టులు దశాబ్దాలుగా  అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా?,  మావోయిస్టుల  సానుభూతి పరులు సాధించిందేంటి?,  మావోయిస్టులు ఎవరున్నా తుపాకీ వీడి లొంగిపావాల్సిందే.. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. పౌర హక్కుల సంఘం నేతలారా.. నక్సల్స్ నచ్చజెప్పండి’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు బండి సంజయ్. కేవలం సర్వే మాత్రమే జరిగిందన్నారు. ఇక్కడ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు. ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి నిర్వహించేది కులగణన అని అన్నారు. జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుందన్నారు.  బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు బండి సంజయ్.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్

 

Advertisement
 
Advertisement
Advertisement