సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలి సమావేశంలో 26 అంశాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ధర్మకర్తల మండల చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులతో బాలాలయ స్థలంలో నిత్య కల్యాణ మండపం నిర్మించనున్నారు. రూ 9.87 కోట్లతో రాయగిరి వద్ద నిర్మించనున్నారు. 3.67 కోట్లతో ఆర్చ్ నిర్మించనున్నారు. కొండపై ఎలక్ట్రికల్ శంకు చక్రం నామాలకు ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ రూ. 84 లక్షలు విరాళం ప్రకటించారు.
అన్న ప్రసాదం భోజన సామర్థ్యం 2 వేల మందికి పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తులసి కాటేజ్ వద్ద ప్రత్యేక కల్యాణ కట్ట, డోనార్ ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మాణం, సోలార్ పవర్ జనరేషన్ నిర్మాణం, కాలినడకన మెట్ల మార్గంలో షెడ్ నిర్మాణం, 43.12 కోట్లతో దీక్షపరుల మండపం నిర్మించేలా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది.


