- కీలక మహిళా నేత సునీతక్క లొంగుబాటు
- చత్తీస్‌ఘడ్ పోలీసుల ఎదుట సరెండర్
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక మహిళా నేత సునీతక్క మరికొం దరు మావోయిస్టులతో కలిసి చత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల మీదున్న రివార్డులను పోలీసులు అందించారు. సునీతక్క 2022లో మావోయిస్టు పార్టీలో చేరి మాడ్ ప్రాం తంలో 6నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం పార్టీలో కీలక నేతగా ఎదిగి అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు.
అయితే.. సునీత లొంగుబాటు ఒక ముఖ్యమైన విజయంగా అధికారులు అభివర్ణించారు. సునీతకు పునరావసంతో పాటు రివార్డులు అందించినట్లు పోలీస్ ఉన్న తాధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మావోయిస్టులు ఆ యుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీసుల ఎదుట లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్రావు శనివారం కామ్రేడ్లకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశంలోని మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, గిరిజన శ్రేయోభిలాషులు తమ నిర్ణయాన్ని అర్థంచేసుకుని మద్దతు ఇవ్వాలని కోరారు.


