
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని సౌత్ వెస్ట్ రీజియన్‌లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
కాగా, జూలై 18న భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడానికి యత్నించారు. అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టుల వేరివేతే లక్ష్యంగా భదత్రా బలగాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టులు లొంగిపోవడం ఒకటైతే, ఇంకోటి ఏరివేతే అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించలేదు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులనే ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఆపరేషన్ల పేరుతో మావోయిస్టుల ఉన్న ఏరియాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.