
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ చేసిన ఆగంతకులు అంతు చూస్తామంటూ బెదిరించారు. ఇప్పటికే రఘునందరావుకు రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల పేరుతో 7297965748 నంబర్‌తో ఫోన్ కాల్ వచ్చింది.
‘మరి కాసేపట్లో నిన్ను లేపేస్తాం. ఆపరేషన్ కగార్ ఆపండి. లేదంటే నీ ప్రాణాలు తీస్తాం. ఇప్పటికే మా టీంలు హైదరాబాద్‌లో ఉన్నాయి. దమ్ముంటే కాపాడుకో’ అంటూ గతంలో కూడా అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘనందన్ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ రోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతామంటూ.. మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి మరో ఫోన్ కాల్ మరో ఫోన్ కాల్ వచ్చింది.. గత నెలలో రోజుల వ్యవధిలో రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. తాజాగా మూడో సారి బెదిరింపు కాల్ వచ్చింది.