
మావో అగ్రనేతలకు ముప్పుగా బాడీగార్డులు
నంబాల నుంచి నేటి ఎన్‌కౌంటర్ వరకు ఇదే పరిస్థితి
అకస్మాత్తుగా పోలీసులకు లొంగిపోతున్న రక్షణ దళ సభ్యులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీని కోవర్టుల సమస్య మరోసారి పట్టి పీడిస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతల వద్ద పనిచేస్తున్న రక్షణ దళ సభ్యులే కోవర్టులుగా మారుతున్నారు. పార్టీ వ్యూహాలు, నేతల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని భద్రతా దళాలకు చేరవేస్తున్నారు. అంతేకాదు ఎన్‌కౌంటర్లకు మార్గనిర్దేశం చేస్తు న్నారు. ఇటీవల జరిగిన వరుస ఘటనలపై మావోయిస్టు పార్టీ స్పందించిన తీరును పరిశీలిస్తే ఈ విషయాలన్నీ వాస్తవమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నంబాల కన్నుగప్పి...
మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు మే 21న చనిపోయారు. అంతకంటే 4 రోజుల ముందు మే 17న నంబాల రక్షణ దళంలోని ఓ జంట అకస్మాత్తుగా దళాన్ని వీడింది. ఆ వెంటనే మే 19న భద్రతా దళాలు నంబాల బృందం బస చేసిన క్యాంప్‌ను చుట్టుముట్టాయి. అప్పటి నుంచి మే 21వరకు దట్టమైన అడవిలో సుమారు నలభై కిలోమీటర్లకు పైగా నంబాల బృందాన్ని భద్రతా దళాలు దారి తప్పకుండా వెంబడించాయి. నంబాల టీమ్‌ను వీడి వెళ్లిన జంట మావోయిస్టులే భద్రతా దళాలకు నంబాల బృందం జాడను పక్కాగా తెలిపింది. అందుకే ఆపరేషన్‌లో పార్టీ చీఫ్ చనిపోయాడు.
కర్రిగుట్టల దగ్గర అంతా
దేశంలోనే అతి పెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రిగుట్టల దగ్గర ఏప్రిల్ 21న మొదలైంది. సుమారు 20 వేల మంది బలగాలు 21 రోజుల పాటు ఈ గుట్టలను చుట్టుముట్టాయి. హెలికాప్టర్లు వినియోగించినా ఆశించిన పురోగతి సాధించలేకపోయాయి. ఈ ఆపరేషన్‌పై మావోయిస్టులు స్పందిస్తూ తమ పార్టీకే చెందిన ఓ వ్యక్తి ఆపరేషన్ మొదలైన రెండు వారాలకు పోలీసులకు లొంగిపోవడంతో తమకు స్వల్పంగా నష్టం జరిగిందని వెల్లడించారు. అప్పటి వరకు తమ దగ్గరకు భద్రతా దళాలు చేరుకోలేకపోయా యంటూ సెపె్టంబర్‌లో జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు.
ఉదయ్ విషయంలోనూ..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జూలైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల గణేశ్ అలియాస్ ఉదయ్ చనిపోయాడు. ఈ ఎన్‌కౌంటర్ జరగడానికి రెండు వారాల ముందే గాజర్ల టీమ్‌లో కీలకంగా ఉన్న ఇద్దరు మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారు. గాజర్ల కదలికలకు సంబంధించి కీలక సమాచారం చేరవేశారు.
దీని ఆధారంగా అర్ధరాత్రి వేళ ట్యాబ్‌ను ఓపెన్ చేసి మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని గాజర్ల ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడనే విషయం భద్రతాదళాలకు తెలిసింది. దీని ఆధారంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పక్కాగా ఉదయ్‌ను చుట్టుముట్టడంతో ఆయనతో పాటు మరో కీలక మావోయిస్టు చైతే కూడా చనిపోయింది. దీంతో ఏఓబీలో పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయ్యింది.
అక్కడా అంతే
జార్ఖండ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీతోపాటు ఇద్దరు డివిజనల్ సభ్యులు, సెపె్టంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సహదేవ్ సోరె న్‌తో పాటు ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యు లు చనిపోయారు. ఈ రెండు ఘట నల్లో కేవలం అగ్రనాయకులే చనిపోవడం వెనుక కోవర్టు ఆపరేషన్ జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అంతకు ముందు జూన్‌లో ఇంద్రావతి నేషనల్ పార్కులో కేంద్ర కమిటీ సభ్యులు తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్‌తో పాటు మైలా రపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ తో పాటు మరో 8మంది మద్దేడు ఏరియా కమిటీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ తెలంగాణలోని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించా రు. అయితే, ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
కానీ ఆ తర్వాత వరుసగా 2 రోజుల్లో సుధాకర్, భాస్కర్ ఎన్‌కౌంటర్ అయ్యారు. దీంతో పౌర హక్కుల సంఘం నేతలు చేసిన ఆరోపణలు నిజమేనన్న పరి స్థితి ఏర్పడింది. చలపతి, బాలన్న ఎన్‌కౌంటర్ల విషయంలోనే బలమైన ఆరోపణలు రాలేదు.