
మహిళా శక్తి అంటే ఏంటో తెలంగాణ మహిళలు బతుకమ్మ ఉత్సవాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ప్రముఖ సినీనటి కుష్బూ అన్నారు.

మంగళవారం చార్మినార్ వద్ద బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చార్మినార్ వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సినీ నటి కుష్బూ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.















