మావోయిస్టుల ముసుగేసి.. ఫోన్లు ట్యాప్‌ చేసి! | Mahesh Kumar Goud appeared before the SIT and gave his statements | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ముసుగేసి.. ఫోన్లు ట్యాప్‌ చేసి!

Jun 18 2025 12:42 AM | Updated on Jun 18 2025 12:42 AM

Mahesh Kumar Goud appeared before the SIT and gave his statements

ట్యాపింగ్‌కు మావోయిస్టుల పేరు వాడుకున్న ప్రభాకర్‌రావు టీమ్‌

2023 నవంబర్‌లో ఒకే రోజు 600 ఫోన్లు ట్యాపింగ్‌

సిట్‌కు వాంగ్మూలం ఇచ్చిన పీసీసీ చీఫ్, రాజ్యసభ ఎంపీ

నేడు పలువురు బీజేపీ నాయకులు, వ్యాపారుల వాంగ్మూలం

బుధవారం నాలుగోసారి విచారణకు టి.ప్రభాకర్‌రావు

ట్యాపింగ్‌కు కేసీఆర్, కేటీఆర్‌లే సూత్రధారులు: మహేశ్‌కుమార్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్తకొత్త విష యాలు బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు టార్గెట్‌ చేసిన బడా వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయ డానికి నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు టీమ్‌.. వారందరికీ మావోయిస్టుల ముసుగు వేసినట్లు తేలింది. కొందరి ఫోన్‌ నంబర్లు మావోయిస్టులవి అని, మరికొందరివి వారి సానుభూతిపరులవి అని, ఇంకొందరు మావో యిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానాలు అంటూ ట్యాపింగ్‌కు అనుమతి పొందారు. 

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు ఆ విషయాన్ని గుర్తించి.. ప్రభాకర్‌రావు టీమ్‌ ఎవరి ఫోన్లను ట్యాప్‌ చేసిందో, వారందరినీ బాధితుల జాబితాలో చేర్చారు. వారికి సాక్షులుగా నోటీసులు జారీ చేసి వాంగ్మూలాల నమోదు ప్రారంభించారు. మంగళవారం పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్, గద్వాల నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ సరిత, ఆమె భర్త తదితరులు సిట్‌ ఎదుట హజరై వాంగ్మూలాలు ఇచ్చారు. 

నేడు మరికొందరు
బుధవారం ఈటల రాజేందర్, ధర్మపురి అర వింద్, రఘునందన్‌రావు సహా మరికొందరు బీజేపీ కీలక నేతలు సిట్‌ ముందు వాంగ్మూ లాలు ఇవ్వనున్నారు. మరోపక్క ప్రభాకర్‌ రావును మంగళవారం విచారించాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) వేల ఫోన్లు ట్యాప్‌ చేసింది. రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, ప్రముఖులు, కొందరు జర్నలిస్టు లపై ఎస్‌ఓటీ నిఘా ఉంచిందని తేలింది. 2023 నవంబర్‌ 15న ఒకేరోజు ఏకంగా 600 ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. 

ట్యాపింగ్‌ చేసే ఫోన్‌ నంబర్లు, వివరాలను రివ్యూ కమిటీని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ప్రభాకర్‌రావు అవన్నీ మావోయిస్టులు, వారికి మద్దతు ఇస్తున్నవారివి అని చెప్పి ట్యాపింగ్‌కు అనుమతి పొందారు. ఫలానా నంబర్లు ట్యాప్‌ చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు రాసిన లేఖల్లో కొన్నింటిని సిట్‌ అధికారులు సేకరించారు. నాడు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తుల ఫోన్లు సైతం ఎస్‌ఓటీ ట్యాప్‌ చేసింది. 

ప్రణీత్‌రావు ఆ వివరాలను ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావుకు అందించారని సిట్‌ గుర్తించింది. ట్యాపింగ్‌ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను నివేదికలుగా మార్చి అవసరమైన వారికి ప్రభాకర్‌రావు పంపారు. దీనికోసం ప్రత్యేకంగా టైపింగ్‌ బృందా లను ఏర్పాటు చేశారు. ట్యాపింగ్‌లో వెలుగులోకి వచ్చిన కీలక వివరాలను అప్పటి అధికారపార్టీ నేతలకు భుజంగరావు, రాధాకిషన్‌రావు అందించినట్లు అధికారులు చెప్తున్నారు. 

కేసీఆర్, కేటీఆరే సూత్రధారులు
రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా, నేను వర్కింగ్‌ ప్రెసి డెంట్‌గా 2021లో బాధ్యతలు స్వీకరించాం. అప్పటి నుంచి చాలా సందర్భాల్లో మా కదలి కల్ని వాళ్లు గుర్తించారు. దీంతో మా ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయని అనుమానం వచ్చింది. అప్పటి చీఫ్‌ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేశా ం. ఇవాళ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చట్ట వ్యతిరేకంగా కొన్ని వేల మంది కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఇది హేయ మైన చర్య. ఇలాంటి చర్యకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్‌లు సిగ్గుతో తల వంచుకోవాలి. 

2018లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా ట్యాపింగ్‌ అని అర్థం అవుతోంది. 2022 నుంచి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లు అన్నీ ట్యాపింగ్‌లో ఉన్నాయి. సిట్‌ అధికారులు చూపించిన లిస్టు ప్రకారం 650 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఈ వ్యవహా రానికి వంద శాతం సూత్రధారులు ఆనాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే. నాటి సీఎస్‌ సోమేశ్‌ కుమార్, హోం సెక్రటరీ, డీజీపీలను కూడా శిక్షించాలి.  – మీడియాతో మహేశ్‌ కుమార్‌ గౌడ్, టీపీసీసీ చీఫ్‌ 

కేసీఆర్‌కు సోమేశ్‌కుమార్, ప్రభాకర్‌రావు లొంగిపోయారు
గత ప్రభుత్వంలో కేసీఆర్, ఆయన కుటుంబీకులు ప్రభుత్వ సంస్థను దుర్వినియోగం చేశారు. నాటి సీఎస్‌ సోమేశ్‌కుమార్, ప్రభాకర్‌ రావు తదితరులు కేసీఆర్‌ కుటుంబానికి లొంగిపోయారు. ట్యాపింగ్‌ ద్వారా లభించిన సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. ఇది దేశద్రోహంతో సమానం. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు కాబట్టే ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారు. – మీడియాతో అనిల్‌కుమార్‌ యాదవ్, రాజ్యసభ సభ్యుడు

Advertisement
 
Advertisement
Advertisement