‘తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం..’ | Our Target Capturing Power in Telangana Ramchander Rao | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం..’

Aug 7 2026 6:22 PM | Updated on Aug 7 2026 6:33 PM

Our Target Capturing Power in Telangana Ramchander Rao

ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే తెలంగాణలో పోటీకి దిగుతామన్నారు.

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో తెలంగాణ నేతల సమావేశం అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ‘ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. కీలక నేతలు మా పార్టీలో చేరేందుకు  సమయం కోసం వేచి చూస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు లేవు... భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి.  ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వస్తారు.  

ప్రజా సమస్యలపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో  అవినీతి పెరిగిపోయింది. కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ నిర్దేశం చేశారు.  అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఎంపీ , ఎమ్మెల్యేలతో కలిసి మరోసారి సమావేశం అవుతాం. రాష్ట్రంలో అధికారం రావడానికి  రోడ్ మ్యాప్ తయారు  చేయాలని ఆదేశించారు. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. చాలా మంది నేతలు మా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement