ఇండిగో సంక్షోభం సృష్టించిన గందరగోళం మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు, విమానయాన రంగంలో ఉన్న డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ అనే మరో రెండు కొత్త విమానయాన దరఖాస్తుదారులకు కేంద్రం నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు (ఎన్‌ఓసి) మంజూరు చేసింది. దీంతో అనుమతుల లభించిన ఎయిర్‌లైన్స్ సంఖ్య మూడుకు చేరింది.
పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. గత వారం రోజులుగా, భారత ఆకాశంలో పరుగులు తీయాలని ఆకాంక్షిస్తున్న కొత్త విమానయాన సంస్థలు శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్ ఫ్లైఎక్స్‌ప్రెస్ - బృందాలను కలవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గత వారంలో విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మూడు విమానయాన సంస్థల బృందాలతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఇప్పటికే శంఖ్ ఎయిర్‌కు ముందుగా ఎన్‌ఓసి లభించగా, అల్ హింద్ ఎయిర్ , ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు ఈ వారం క్లియర్ అయ్యాయి.
Over the last one week, pleased to have met teams from new airlines aspiring to take wings in Indian skies—Shankh Air, Al Hind Air and FlyExpress.
While Shankh Air has already got the NOC from Ministry, Al Hind Air and FlyExpress have received their NOCs in this week.
It has… pic.twitter.com/oLWXqBfSFU— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 23, 2025
భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్‌లో ఇండిగో, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గ్రూప్ అనే రెండు ప్రధాన ఎయిర్‌లైన్స్ 90శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఈ అనుమతులు ప్రాధాన్యతనుసంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్


