breaking news
NOC issued
-
ఇండిగో సంక్షోభం : మరో రెండు ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్
ఇండిగో సంక్షోభం సృష్టించిన గందరగోళం మధ్య కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు, విమానయాన రంగంలో ఉన్న డిమాండ్‌ను తీర్చే లక్ష్యంతో రెండు విమానయాన సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ అనే మరో రెండు కొత్త విమానయాన దరఖాస్తుదారులకు కేంద్రం నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు (ఎన్ఓసి) మంజూరు చేసింది. దీంతో అనుమతుల లభించిన ఎయిర్‌లైన్స్ సంఖ్య మూడుకు చేరింది. పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. గత వారం రోజులుగా, భారత ఆకాశంలో పరుగులు తీయాలని ఆకాంక్షిస్తున్న కొత్త విమానయాన సంస్థలు శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్ ఫ్లైఎక్స్‌ప్రెస్ - బృందాలను కలవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గత వారంలో విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మూడు విమానయాన సంస్థల బృందాలతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఇప్పటికే శంఖ్ ఎయిర్‌కు ముందుగా ఎన్ఓసి లభించగా, అల్ హింద్ ఎయిర్ , ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకు ఈ వారం క్లియర్ అయ్యాయి.Over the last one week, pleased to have met teams from new airlines aspiring to take wings in Indian skies—Shankh Air, Al Hind Air and FlyExpress. While Shankh Air has already got the NOC from Ministry, Al Hind Air and FlyExpress have received their NOCs in this week. It has… pic.twitter.com/oLWXqBfSFU— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 23, 2025భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గ్రూప్ అనే రెండు ప్రధాన ఎయిర్‌లైన్స్ 90శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఈ అనుమతులు ప్రాధాన్యతనుసంతరించుకున్నాయి.ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
అగ్గి.. బుగ్గి ఆగట్లే!
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని పలు వ్యాపార కేంద్రాలు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం సూచించే రక్షణ చర్యలను పెడచెవిని పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం రెండు మూడు రోజులకు ఎలాంటి చర్యలు తీసుకోకుం డానే వదిలేయడం పరిపాటిగా మారింది. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని పెయిం టింగ్, ఎలక్ట్రికల్ గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఇందుకు ఓ ఉదాహరణ. అదృష్టవశాత్తూ ఇక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం వాటిల్లింది. వివిధ విభాగాల అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్నో గంటల పాటు పోరాడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నగరంలో తరచూ ఇలాంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. చర్యల్లో మాత్రం సంబంధిత యంత్రాంగం విఫలమవుతోంది. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత మరచిపోతున్నారు. గోడౌన్ల నుంచి హాస్పిటళ్లు, హోటళ్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల దాకా ఇదే పరిస్థితి. వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి పొంచి ఉన్న ప్రమాదాల గురించి తెలిసినా, చర్యలు తీసుకోలేకపోతున్నారు. పురాతన భవనాల నుంచి కొత్త బిల్డింగ్‌ల వరకు ఇదే పరిస్థితి. ఈ భవనాలకు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోవడం.. ఉన్నా పనిచేయకపోవడం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెలుగుచూస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే ఫైరింజన్లు, అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని ఇరుకు గల్లీల్లో అనుమతుల్లేకుండానే గోడౌన్ల ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూళ్లకు మరిగిన స్థానిక అధికారులు అనుమతుల్లేకున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఫైర్‌సేఫ్టీ నిబంధనలు, అమలుపై కొరడా ఝళిపిస్తున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఫైర్ ఎన్ఓసీలు లేని విద్యాసంస్థలకు ఈ భవనం ప్రమాదకరమని సూచిస్తూ పుర్రె బొమ్మల పోస్టర్లు అంటిస్తామని బల్దియా ప్రకటించినప్పటికీ చర్యల్లేవు. ఏటా ఆయా భవనాలను తనిఖీ చేసి నోటీసులిచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా దాదాపు ఏడాదిన్నర కాలంగా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన భవనాలు నలభై వేలకు పైగా ఉన్నప్పటికీ దాదాపు మూడు వేల భవనాలకు మాత్రమే ఎన్ఓసీలు ఉన్నట్లు సమాచారం. అవి కూడా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేముందు ఏర్పాటు చేసుకున్నవి. ఆ తర్వాత ఎన్ని భవనాల యాజమాన్యాలు ఫైర్‌సేఫ్టీ నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నాయో, అసలు నిర్వహణ ఉందో లేదో తెలియని పరిస్థితి. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే షాపింగ్ కాంప్లెక్సులు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, హాస్టళ్లు, సినిమాహాళ్లు, పబ్బులు, క్లబ్బులు చాలామటుకు ఫైర్‌సేఫ్టీ లేకుండానే కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆయా భవనాలకు ముఖ్యంగా పాఠశాలల భవనాలకు చుట్టూ ఆరుమీటర్ల ఖాళీ స్థలం ఉంటేనే ఫైర్ ఎన్ఓసీ ఇవ్వాలని గతేడాది జూన్ నుంచి కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. అయితే ఇప్పుడు అది ఎంతవరకు అమలు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నోటీసులతో సరి.. చర్యల్లేవ్.. గ్రేటర్లో 500 చ.మీ. స్థలంలో లేదా ఆరు మీటర్లు ఎత్తున్న భవనాల నుంచి 15 మీటర్ల ఎత్తు వరకున్న భవనాలకు జీహెచ్ఎంసీ అనుమతులిస్తుంది. అంతకంటే ఎక్కువ ఎత్తున్న విద్య, వ్యాపార, వాణిజ్య, తదితర భవనాలు, గోడౌన్లు, పరిశ్రమలకు రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం అనుమతులిస్తుంది. ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించనివారిపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం మినహా, తనంతతానుగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి అధికారం లేదు. దీంతో ఆయా భవన యాజమాన్యాలకు నోటీసులిస్తున్నా స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫైర్‌సేఫ్టీలేని అస్పత్రులపై జిల్లా వైద్యాధికారుల ద్వారా, ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ ద్వారా, ఇతరత్రా సంస్థలపై సంబంధిత శాఖల ద్వారా ఆయా సంస్థల అనుమతులు, లైసెన్సులు రద్దు చేయించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విస్మరించారు. మేల్కొలిపిన ముంబై పబ్ దుర్ఘటన గత డిసెంబర్లో ముంబైలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటన అనంతరం అక్కడి ఫైర్ బ్రిగేడ్ విభాగాన్ని రెండు భాగాలుగా చేసి ఒక విభాగం తనిఖీలు చేయాలని, మరో విభాగం ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అన్ని సంస్థలను తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఉండేలా చర్యలకు సిద్ధమయ్యారు. అక్కడ అప్పటికున్న 35 ఫైర్‌సేఫ్టీ నిబంధనల్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. థియేటర్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, షాపులు నిర్మాణాల్లో వినియోగించే సామగ్రి నుంచి ఫర్నిచర్‌కు వరకు అగ్నికి త్వరగా కాలిపోని సామగ్రిని వాడేలా నిబంధనల్లో పొందుపరచాలని భావించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంబంధిత అధికారులపై కూడా చర్యలకు సిద్ధమయ్యారు. కానరాని తనిఖీలు.. ముంబై పబ్ ప్రమాద నేపథ్యంలో నగరంలోని పబ్బులు, క్లబ్బులు తదితర జనసమ్మర్థం ఉండే సంస్థలను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం–పారిశుధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి భావించారు. తనిఖీల సమయంలోనే భవన నిర్మాణ అనుమతి, ట్రేడ్ లైసెన్సు, ఆస్తిపన్ను చెల్లింపు వంటి అంశాలనూ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ అవి మాత్రం అమలుకు నోచుకోలేదు. జీహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం నోటీసులిచ్చిన.. ఎన్ఓసీలు పొందిన సంస్థలిలా సంస్థలు సంఖ్య ఎన్ఓసీలు పొందినవి 1. ప్రైవేట్ ఆస్పత్రులు 1170 465 2. ప్రైవేట్ పాఠశాలలు 3023 899 3. ఫంక్షన్ హాళ్లు 707 34 4. టింబర్ డిపోలు 123 – 5. హోటళ్లు, రెస్టారెంట్లు 1608 171 6. హాస్టళ్లు 276 11 7. వస్త్రదుకాణాలు, షోరూమ్స్ 6124 8. ఎలక్ట్రికకల్,ఎలక్ట్రానిక్స్ షాపులు,షోరూమ్స్ 4827 01 9. బాణసంచా దుకాణాలు (పర్మినెంట్) 68 – 10. ఆభరణాల దుకాణాలు 41 – 11. స్టోరేజ్(గోడౌన్లు) 1068 – 12. సినిమాహాళ్లు 90 16 13. పరిశ్రమలు – 16 14. బ్యాంకులు – 02 15. పెట్రోల్ బంకులు – 44 గత మూడేళ్లలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు, ఎన్ఓసీలు.. సంవత్సరం నోటీసులు ఎన్ఓసీలు 2015 491 384 2016 400 352 2017 170 110 -
అగ్నిమాపక శాఖ సెట్‌బ్యాక్ మెలిక
⇔ ఎన్వోసీ జారీలో తీవ్ర జాప్యం ⇔ నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని వాదన ⇔ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న డెవలపర్లు ⇔ కోర్టు తీర్పునూ బేఖాతరంటున్న అధికారులు ⇔ మొత్తంగా ప్రాజెక్ట్‌ల ఆరంభం ఆలస్యం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాలను కల్పించేది నిర్మాణ రంగం. పన్నుల రూపంలో ఖజానాకు కోట్లాది రూపాయలను సమకూర్చి.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేది కూడా ఈ రంగమే! ఇంతటి ప్రాధాన్యమున్న నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వానిది చిన్నచూపేనని నిర్మాణ సంస్థల ఆరోపణ. ఎవరి వాదనేంటో ఓ సారి చూద్దాం. ⇔ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీలో అధికారులు డెవలపర్లను తీవ్రంగా వేధిస్తున్నారని.. వాస్తవానికి నిర్మాణ అనుమతులకు పలు విభాగాల ఎన్వోసీలు అవసరం లేదని.. ఒకే ఒక్క ఎన్వోసీ చాలని ఓ స్థిరాస్తి సంఘం ప్రాపర్టీ షోలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్వోసీ మాత్రమే కాదు నిర్మాణ రంగాన్ని వేధిస్తున్న పలు నిబంధనల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పలుమార్లు ప్రస్తావించారు కూడా. కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని నిర్మాణ సంస్థల వాదన. ⇔ బహుళ అంతస్తుల భవనాలకు, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకొని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిర్మాణం నిబంధనల ప్రకారం ఉన్నా.. లేదని అడ్డంగా వాదిస్తున్నారని ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’తో వాపోయారు. 4 వారాల్లో జారీ చేయాల్సిన ఎన్వోసీని 4 నెలలైనా ఫైలు ముందుకు కదల్చట్లేదని తెలిపారు. సుమారు 15 మంది డెవలపర్ల ఫైలు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ కోసం ఎదురుచూస్తున్నాయని సమాచారం. కొందరు డెవలపర్లయితే న్యాయం కోసం కోర్టునూ ఆశ్రయిస్తున్నారు. డెవలపర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు నిచ్చినా.. దాన్ని కూడా ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తూ డెవలపర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ⇔ ఓ నిర్మాణ సంస్థ నగరంలో లక్ష చ.అ.ల్లో పోడియం ఆకారంలో వాణిజ్య సముదాయానికి శ్రీకారం చుట్టింది. ఎన్వోసీ జారీ కోసం అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనల్నీ పక్కాగా ఉన్నాయి కూడా. 4 నెలలైనా ఫైలు ముందుకు కదలకపోవటంతో ఇదేంటని సంబంధిత ఉన్నతాధికారిని కలిస్తే.. మొదటి అంతస్తు నుంచే 11 మీటర్ల సెట్‌బ్యాక్‌ను వదలాలని మెలిక పెట్టారని వాపోయారు. 168 జీవో ప్రకారం.. పోడియం ఆకారంలో నిర్మాణాలకు 5వ అంతస్తు వరకు 9 మీటర్ల సెట్‌బ్యాక్, ఆపైన 5 అంతస్తుల వరకు 1 మీటర్ సెట్‌బ్యాక్ వదలాలనే నిబంధన ఉంది. కానీ, జీవోతో తనకు సంబంధం లేదని తాను చెప్పినట్టు వదిలితేనే ఎన్వోసీ జారీ చేస్తానని ఉన్నతాధికారి వాదిస్తుండటంతో డెవలపర్‌కు ఏం చేయాలో పాలుపోవట్లేదు. పోనీ ఉన్నతాధికారి చెప్పినట్లు 11 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే స్థల యజమాని నష్టపోవటమే కాకుం డా బిల్టప్ ఏరియా తక్కువొస్తుందని, నిర్మాణ వ్యయం పెరుగుతుందని డెవలపర్ వాదన. గతంలో ఇలాంటి నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఇదే ఉన్నతాధికారి.. ఇప్పుడు సెట్‌బ్యాక్ మెలిక పెట్టడం గమనార్హం.


