దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ 3-5 మధ్య విమాన రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణికులందరికీ రిఫండ్ ప్రాసెస్ చేసిందని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా తెలిపింది.
‘డిసెంబర్ 3-5 వరకు కార్యకలాపాల అంతరాయాల కారణంగా బాధిత ప్రయాణీకులకు అందించే రిఫండ్‌లు, పరిహారాలకు సంబంధించి దేశీయ క్యారియర్ ఇండిగోతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది’ అని డీజీసీఏ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఇండిగో విమానాల రద్దుకు సంబంధింంచి అన్ని రిఫండ్లను పూర్తిగా ప్రాసెస్ చేసి, చెల్లింపులు క్లియర్ చేసినట్లు ఇండిగో తెలియజేసిందని వివరించింది.
అంతేకాకుండా ఎక్కువ అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఊరట కల్పించడానికి అదనపు చర్యగా విమానయాన సంస్థ "గెస్చర్ ఆఫ్ కేర్’ పేరుతో ఒక్కొక్కరికీ రెండు రూ.5,000 ట్రావెల్ వోచర్లను అందించినట్లుగా తెలిపింది. వీటికి 12 నెలల చెల్లుబాటు ఉంటుందని, ఆయా తేదీల్లో ఫ్లైట్లు రద్దవడం లేదా మూడు గంటల కంటే ఆలస్యంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీటిని అందించినట్లుగా పేర్కొంది.
బాధిత ప్రయాణికులకు రిఫండ్ పూర్తయినట్లు ఇండిగో, డీజీసీఏ చెబుతుంటే మరో వైపు తమకు రిఫండ్ అందలేదని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇండిగోను, డీజీసీఏ ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
Press note on refunds, compensation to passengers affected by operational disruptions of Indigo between 3rd - 5th Dec 25
Imp Links:
Eligibility for Compensation https://t.co/FVXEWXoQot
Submission of Details https://t.co/FdGdQmsLAY
List of Flights Covered https://t.co/ks5u0wBVaO pic.twitter.com/adjmIb1nth— DGCA (@DGCAIndia) January 16, 2026


