చిరు ఇంట్లో​ పీవీ సింధుకు సత్కారం, టాలీవుడ్‌ ప్రముఖుల హాజరు | Chiranjeevi Congratulates PV Sindhu And Host Party At His Home | Sakshi
Sakshi News home page

PV Sindhu: చిరు ఇంట్లో పీవీ సింధును సత్కరించిన సినీ ప్రముఖులు

Aug 28 2021 8:51 PM | Updated on Aug 29 2021 10:33 AM

Chiranjeevi Congratulates PV Sindhu And Host Party At His Home - Sakshi

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ హీరోలు కింగ్‌ నాగార్జున, అల్లు అరవింద్‌, రానా, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌ పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు సుహాసిని, రాధిక శరత్‌ కుమార్‌ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్‌, అల్లు అరవింద్‌ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్‌తో వారంతా ఫొటోలు దిగారు. 

చదవండి: ప్రభాస్‌ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్‌

ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.

చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్‌ రాజ్‌ ఆఫీసులో బిగ్‌బాస్‌ సభ్యులకు నైట్‌ పార్టీ!

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement