
చెన్నై : నటి రాధికా శరత్‌కుమార్ తనకు తల్లి కాదు అని పేర్కొంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. సంచలనాలకు మారు పేరు ఈ బ్యూటీ. అంతేకాదు తెగువ, ధైర్యం వంటి వాటిలో తనకు తానే సాటి అని చెప్పవచ్చు. విదేశాల్లో పెరిగిన వరలక్ష్మీశరత్‌కుమార్ మంచి బెల్లీ డాన్సర్ అన్నది చాలా మందికి తెలియదు. పోడాపోడీ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత కన్నడంలో నటించింది. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో అయితే పాత్రలో నటించడానికి అవకాశం ఉంటే అది కథానాయకి అయినా, ప్రతినాయకి అయినా, ఇంకేదయినా నటించడానికి సై అంటోంది. అలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీశరత్‌కుమార్ అతి తక్కువ కాలంలోనే 25 చిత్రాలను దాటేసింది. (‘చాన్స్ కోసం గదికి రమ్మన్నారు’)
కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పేర్కొంటూ తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుంచి ఏది సరి అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది. అందుకే తనతో మాట్లాడడానికి చాలా మంది భయపడతారని అంది. మరో విషయాన్ని కూడా వరలక్ష్మీశరత్‌కుమార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. నటి రాధికశరత్‌కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తమిళంలో కిళక్కే పోగుమ్ రైల్ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు సహా ఇతర భాషల్లో నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇప్పటికీ ముఖ్య పాత్రల్లో నటిస్తూ, మరో పక్క బుల్లితెర రాణిగా రాణిస్తున్న ప్రముఖ నటి రాధికాశరత్‌కుమార్. అయితే ఈమె నటుడు శరత్‌కుమార్‌ను రెండవ వివాహం చేసుకున్నారన్న విషయం తెలిసిందే.
కాగా శరత్‌కుమార్ మొదటి భార్య కూతురు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈమె ఇంటర్వ్యూలో పలు విషయాలను తనదైన స్టైల్‌లో చెప్పారు. అందులో ముఖ్యంగా తాను రాధికను ఆంటీ అనే పిలుస్తానని చెప్పింది. ఎందుకంటే ఆమె తన తల్లి కాదని అంది. తన తండ్రి రెండవ భార్య. తనకు అమ్మ అంటే ఒక్కరేనని పేర్కొంది. తనకే కాదు ఎవరికైనా అమ్మ ఒక్కరే అని అంది. అందుకే రాధిక తనకు తల్లి కాదని, ఆంటీ అని చెప్పింది. అయితే తాను ఆమెను తన తండ్రి శరత్‌కుమార్‌తో సమానంగా గౌరవం ఇస్తానని చెప్పి దటీజ్ వరలక్ష్మీశరత్‌కుమార్ అనిపించుకుంది. ఆమె బోల్డ్‌నెస్‌కు ఇంతకన్నా రుజువు ఏం కావాలి.