
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్‌కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్‌లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్‌కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి.

అందుకే ఇల్లు మారాం
ప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్‌కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
పర్సనల్ లైఫ్
రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్‌ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్‌కుమార్‌కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్‌కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.