Radhika: ఎంజీఆర్‌కు, నాన్నకు మధ్య జరిగిన కాల్పుల సంఘటనను వెబ్‌ సిరీస్‌గా తీస్తున్నా

Actress Radhika Sarathkumar About Her Father MR Radha And MGR - Sakshi

Radhika About Her Father MR Radha And MGR: రాధిక శరత్‌ కుమార్‌.. తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 80, 90లో స్టార్‌ హీరోయిన్‌గా ఆమె సౌత్‌ ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. ‘న్యాయంగా కావాలి’ సినిమాలో ధైర్యవంతమైన యువతిగా.. స్వాతిముత్యంలో అభినయం పోషించిన రాధిక ఫైర్‌బ్రాండ్‌ అనే గుర్తింపు పొందారు. దాదాపు ఆమె దక్షిణాదికి చెందిన అందరు స్టార్‌ హీరోలు, లెజెండరి నటులతో కలిసి నటించారు. తమిళ నటుడు ఎం.ఆర్‌ రాధా వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన రాధిక తనకంటు సొంత గుర్తింపును ఎర్పరుచుకున్నారు. 

చదవండి: కాజల్‌ కొడుకు పేరు ఏంటో తెలుసా?

ప్రస్తుతం తల్లి పాత్రలు, సీరియల్స్‌లో నటిస్తూనే మరోపక్క సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ఇటీవల ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె  ఓ  షోకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రాధిక పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. న్యాయం కావాలి సినిమా టైంలో చిరంజీవిని కొట్టే సీన్‌ నిజంగా కొట్టానని, దీనికి తను 23 టేకులు తీసుకున్నానన్నారు. ఆ తర్వాత చూస్తే చిరంజీవి ముఖం ఎర్రగా వాచిపోయిందంటూ రాధిక ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. 

చదవండి: కొత్త జంటకు రణ్‌బీర్‌ తల్లి కళ్లు చెదిరే ఫ్లాట్‌ గిఫ్ట్‌, ఖరీదెంతంటే!

ఆనంతరం ఆమె తమిళ ఇండస్ట్రీలో తన తండ్రి ఎం.ఆర్‌ రాధా, ఎంజీఆర్‌ మధ్య చోటు చేసుకున్న వివాదంపై తాను ఓ వెబ్‌ సీరిస్‌ తీస్తున్నట్లు చెప్పారు. కాగా ఆమె తండ్రి ఎం.ఆర్. రాధా హీరోగానే కాదు, పవర్ఫుల్ విలన్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో తన తండ్రికి, ఎంజీఆర్‌తో మధ్య వివాదస్పద గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే వాటిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆ విషయాలను గురించి రాధిక మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ వివాదాస్పదమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే. అప్పట్లో ఆయనకి .. ఎంజీఆర్‌కి ఏవో గొడవలు ఉండేవి.

చదవండి: బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్‌ ఆర్‌ ఖాన్‌

వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకున్న కాల్పుల సంఘటన గురించి చాలామందికి తెలుసు. ఆ సంఘటన నేపథ్యంలోనే ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. నా కెరియర్ నా చేతిలో ఉండాలనే ఉద్దేశంతోనే 'రాడాన్' సంస్థను స్థాపించాను. మా బ్యానర్ మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో ఉన్నాము’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top