ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే | Thalamai Seyalagam Web Series Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published Mon, May 6 2024 5:39 PM | Last Updated on Mon, May 6 2024 5:53 PM

Thalamai Seyalagam Web Series Streaming Date Locked

గతేడాదిలో 'స‌లార్'తో ట్రెండింగ్‌లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'త‌లైమై సేయ‌ల‌గం' వెబ్‌ సిరీస్‌తో రానుంది. త‌మిళంలో పొలిటిక‌ల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాంతార ఫేమ్‌ కిషోర్ మరో లీడ్‌రోల్‌లో న‌టిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.

త‌లైమై సేయ‌ల‌గం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ పొలిటిక‌ల్ డ్రామా సిరీస్‌ను భారీ అంచనాలతో రిలీజ్‌ చేస్తున్నారు​. ఇందులో శ్రియారెడ్డితో పాటు క‌స్తూరి, భ‌ర‌త్‌, ర‌మ్య నంబీశీన్‌, ద‌ర్శ‌న గుప్తా  కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ వ‌సంత బాల‌న్ ఈ పొలిటిక‌ల్ మ్యాజిక్‌ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్‌ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్‌ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో  స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.

రీసెంట్‌గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్‌కుమార్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. త‌మిళ‌నాడులో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రాడాన్ మీడియా వ‌ర్క్స్ ప‌తాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement