'వాట్‌ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్‌ డే విషెస్..! | Radikaa and Charmme wish Trisha on birthday after Vijay TVK win | Sakshi
Sakshi News home page

Trisha: 'ఈ బర్త్‌ డే చరిత్రలో నిలిచిపోతుంది'.. ఛార్మి, రాధికా స్పెషల్ విషెస్

May 5 2026 3:37 PM | Updated on May 5 2026 3:56 PM

Radikaa and Charmme wish Trisha on birthday after Vijay TVK win

తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్‌ కన్‌ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.

కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు.  టీవీకే విజయం సాధించడంతో విజయ్‌ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్‌పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు  చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement