breaking news
velvet
-
భగవద్గీత శ్లోకం, బ్లాక్ వెల్వెట్ గౌను : ఐశ్వర్య సెకండ్ లుక్‌పై ప్రశంసలు
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes Film Festival)లో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్యాన్స్‌లోని ప్యారిస్ లో జరుగుతున్న 78వ కాన్స్ ఉత్సవాల్లో వరుగా రెండోరోజు తన అద్భుతమైన లుక్‌తో అందర్నీ అలరించింది. మాజీ మిస్ యూనివర్స్. మొదటి రోజు చీర, కెంపుల హారం, సింధూరంతో అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. రెండో రోజు లుక్‌లో భారతీయత ఉట్టిపడేలా దర్శనమిచ్చి వావ్ అనిపించింది.కాన్స్ వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించింది. కానీ ఇందులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించడం విశేషం. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ డ్రెస్‌లో ఆమె తళుక్కున మెరిసింది. ముఖ్యంగా చేతితో గీతలోని సంస్కృత శ్లోకాన్ని ఎంబ్రాయిడరీ చేయించుకోవడం విశేషంగా నిలిచింది. బనారసీ కేప్పై భగవద్గీతలోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ’ అనే శ్లోకాన్ని తీర్చిదిద్దుకుంది. వెండి, బంగారం, బొగ్గు , నలుపు రంగుల్లో, మైక్రో గ్లాస్ స్ఫటికాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేసినట్టు డిజైనర్ తెలిపారు. అలాగే వారణాసిలో చేతితో నేసిన ఈ కేప్ పై భగవత్ గీతలోని సంస్కృత శోక్లాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు వెల్లడించారు. దీంతో ఐష్ లుక్‌పై ఫ్యాషన్ వర్గాలు సహా, సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial)ఐశ్వర్య ఫస్ట్ లుక్ సంప్రదాయం, గుర్తింపుకు చిహ్నంగా ఉండగా, రెండవది పునఃనిర్మాణం ఫ్యాషన్‌కి గుర్తు అని వ్యాఖ్యానించారు. 78వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 న ప్రారంభమైనాయి.రేపటితో(24) ఈ వేడుకలు ముగియనున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా -
Sonakshi Sinha Photos: వెల్వెట్ డ్రెస్‌లో అందంగా.. సోనాక్షి (ఫొటోలు)
-
రఫ్పాడిస్తానంటున్న వరలక్ష్మి
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాలు నటి వరలక్ష్మీని వెతుక్కుంటూ వస్తున్నాయి. తారైతప్పట్టై చిత్రంలో డాన్స్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ తాజాగా ఫైట్స్‌లో అదరగొడుతున్నారట. వరలక్ష్మీశరత్‌కుమార్ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రాల్లో వెల్వెట్ నగరం ఒకటి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఈ తరహా కథా చిత్రంలో వరలక్ష్మి నటించడం ఇదే ప్రథమం. ఇందులో తను డైనమిక్ రిపోర్టర్‌గా నటిస్తున్నారట. దీనికి మనోజ్ కమార్నటరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది కథానాయికకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అని చెప్పారు. కొంత కాలం క్రితం కోడైకెనాల్, చెన్నైలో జరిగిన వేర్వేరు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం వెల్వెట్ నగరం అని తెలిపారు. భారీ ఫైట్స్ సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ «థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. 48గంటల్లో జరిగే కథాంశంతో కూడిన ఈ చిత్రం జెట్ వేగంతో సాగుతుందన్నారు. ఇందులో మదురైకి చెందిన క్రైమ్ రిపోర్టర్‌గా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారని చెప్పారు. కోడైకెనాల్‌లో నివశించే గిరిజన సామాజిక వర్గ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఆధారాలు సేకరించడానికి మదురై నుంచి చెన్నైకి వచ్చిన వరలక్ష్మి ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా వెల్వెట్ నగరం ఉంటుందన్నారు. చెన్నై, మదురై, కోడైకెనాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్వహించినట్లు తెలిపారు. చివరి ఘట్ట షెడ్యూల్ చెన్నైలో జరపనున్నట్లు తెలిపారు. -
వెల్వెట్వెచ్చని నెచ్చెలి
మీకేం ఇష్టమో తెలిసిన ఫ్రెండ్ ఒకరు మీకేం ఇష్టం ఉండదో తెలిసిన ఫ్రెండ్ ఇంకొకరు ఇద్దర్లో మీరు ఎవరి దగ్గర ఓపెన్ అవుతారు? మీకేది బాగుంటుందో చెప్పే ఫ్రెండ్ ఒకరు మీకేం బాగుండదో చెప్పే ఫ్రెండ్ ఒకరు ఇద్దర్లో మీరు ఎవర్ని సలహా అడుగుతారు? మీరెలా చెబితే అలా వినే ఫ్రెండ్ ఒకరు మీరేమీ చెప్పకుండానే వినే ఫ్రెండ్ ఒకరు ఇద్దర్లో మీరు ఎవరి తోడును కోరుకుంటారు? సమాధానం మీ మనసుకు తెలుసు. ఆ మనసుకు చక్కగా ఫిట్ అయ్యే నెచ్చెలే... వెల్వెట్! ముఖమల్ అంటే ఆధునికులు కొంత ఆలోచనలో పడతారు. అదే ‘వెల్వెట్’ అంటే ‘వావ్ గుడ్ ఫ్యాబ్రిక్’ అంటూ ఆ క్లాత్‌ని తమ మేనికి అతికించుకుంటారు. చూపులకు కాంతిమంతం, చుట్టుకుంటే మృదుత్వం కట్టుకుంటే కనువిందుచేసే సోయగం ముఖమల్ సొంతం అంటూ మురిసిపోతారు. చూపరుల మదిని కొల్లగొడతారు. రాచరికానికి కొత్త హంగులు అద్దిన ‘ముఖమల్’ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సామాన్యుడిని సైతం పలకరించింది. సింగిల్‌గానే కాదు నీరు ఏ పాత్రలో పోస్తే అందులో ఒదిగిపోయినట్టుగా వెల్వెట్ ఏ ఫాబ్రిక్‌తో కలిస్తే ఆ రూపకంగా సొబగులు అద్దుకుంటూ వచ్చింది. కాని తన గుర్తింపును మాత్రం ఏ మాత్రం కోల్పోకుండా అదే హంగు, ఆర్భాటంతో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. అంతే డిజైనర్ల లుక్‌ను ఆటోమేటిగ్గా తన వైపుకు తిప్పుకుంది. తన చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. చేయిస్తూ ఉంది. సంప్రదాయ తరహాలో ‘కుందనపుబొమ్మల’ను తీర్చిదిద్దే ముఖమల్ ఆధునిక తరహాలో ర్యాంప్షోలపైనా షార్ట్స్‌గా హోయలు పోతోంది. దుస్తులే కాదు యాక్ససరీస్నూ వెల్వెట్ విభిన్నతరహాలో మెరిసిపోతుంది. పట్టుతో తయారైన ముఖమల్ ఫ్యాబ్రిక్ మరింత మృదువుగా ఉండటమే కాదు కాంతిమంతంగానూ ఉంటుంది. దీనిని పోలినట్టుగా ఉండే ఇతర వెల్వెట్ నాణ్యతలో తేడా కనిపిస్తుంది. షిఫాన్ వెల్వెట్ -చాలా తక్కువ బరువుతో కాస్తంత ట్రాన్స్పరెంట్తో అట్రాక్ట్ చేస్తే, పై ఆన్ పై వెల్వెట్ ప్రింట్స్‌తో పలకరిస్తుంది. వీటిలో సిజిల్, క్రషడ్, ఎంబోస్డ్, హ్యామర్డ్, లేయన్స్, మిర్రర్.... వంటి రకరకాల ఫ్యాబ్రిక్‌గా కొత్త అందాలను సింగారించుకుని అతివల మనసులను కొల్లగొడుతుంది. క్రీ.పూ 12 వందల కాలంలో ప్రభువుల కోసమే రూపొందిన ముఖమల్ను మొట్టమొదట బాగ్దాద్ పట్టణంలో తయారుచేసినట్టు, ఆ తర్వాత కాశ్మీర్ వ్యాపారులు ప్రపంచానికి పరిచయం చేసినట్టు చరిత్ర చెబుతుంది. ప్రాచీన రోజుల్లో ముఖమల్ స్వచ్ఛమైన పట్టుతో తయారయ్యేది. అందుకే గజం ముఖమల్ క్లాత్ కొనాలంటే బోలెడన్ని బంగారు కాసులు ఖర్చు చేయాల్సి వచ్చేది. దీంతో ఇది అత్యంత ఖరీదైన వస్త్రంగా ప్రపంచమంతా పేరుపొందింది. ఆ తర్వాత కాలంలో లినెన్, ఊల్, పాలియస్టర్, నైలాన్... వంటి విభిన్నరకాలైన సింథటిక్స్‌తో మేళవించి వెల్వెట్‌ను రూపొందించడం మొదలుపెట్టారు. దీంతో ధర పరంగానూ వెల్వెట్ అందరికీ అందుబాటులోకి దిగిరాకతప్పలేదు. వెల్వెటీన్: టీన్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ వెల్వెట్. కురచ డ్రెస్సులను ఇష్టపడే అమ్మాయిలను ఆకట్టుకునే ఫ్యాబ్రిక్. అలాగే మృదువుగా ఉండటంతో సౌక్యర్యంగా అనిపిస్తుంది. పెద్దగా సాగే గుణం ఉండదు. కాటన్ వెల్వెట్ అయితే చమటను పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. తడిగా ఉన్న పొడిగానే చూపులకు కనిపిస్తుంది. అంతేకాదు చలిని కట్టడి చేసి ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో చలికాలం ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్‌గా వెలుగొందుతుంది. స్టైల్‌గా, స్మార్ట్‌గా, స్టన్నింగ్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ కావడంతో ఈ క్లాత్‌పై మగ్గం పనితీరు అందంగా అమరుతుంది. జర్దోసీ జిగేల్మంటుంది. అద్దాలు మిరుమిట్టుగొలుపుతుంటాయి.చమ్కీలు చమక్కుమంటాయి. యాక్ససరీస్: వెల్వెట్ ప్రాబ్రిక్తో దుస్తులు మాత్రమే కాదు వివిధ రకాల యాక్సరీస్కూడా రూపొందుతున్నాయి. బ్యాగు లు, పర్సులు, చెప్పులు, బెల్ట్‌లు,.. గానూ కనువిందు చేస్తున్నాయి.