మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే.. | World's fittest 102-year-old's secrets for long and active life | Sakshi
Sakshi News home page

మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్‌చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..

May 23 2025 1:54 PM | Updated on May 23 2025 2:55 PM

World's fittest 102-year-old's secrets for long and active life

ఆరుపదుల వయసులో కేన్సర్‌ నిర్థారణ అయ్యింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమేగాక మారథాన్‌లలో రికార్డులు సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాదు తన దీర్ఘాయువు రహస్యం గురించి చెప్పడమే పర్యావరణ పరిరక్షకుడి తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అతడెవరు..? ఎలా అన్నేళ్లు బతికి బట్టగట్టగలిగాడంటే..

ఫ్లోరిడాకు చెందిన 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్ మారథాన్‌లో ఎన్నో వరల్డ్‌ రికార్డులు సాధించాడు. అంతేగాదు వేగంగా మారథాన్‌ చేసిన 91 ఏళ్ల వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా మారథాన్, హాఫ్ మారథాన్, కనోయింగ్‌ క్రీడా తదితరాలకు సంబంధించి అనేక ప్రపంచ రికార్డులు కలిగి ఉన్నాడు. నిజానికి మైక్‌ 60 ఏళ్ల వయసులో కేన్సర్‌ బారినపడ్డాడు. 

మహా అయితే మూడు నెలలకు మించి బతకడని తేల్చి చెప్పేశారు వైద్యులు. మరోవైపు ఆర్థరైటీస్‌ సమస్యలు కూడా ఉన్నాయతనికి. అప్పడే మైక్‌ తన ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని స్ట్రాంగ్‌ డిసైడయ్యాడు. ఆ నేపథ్యంలో కేన్సర్‌ని నివారించే ఆహారాల గురించి సవివరంగా తెలుసుకున్నాడు. 

దీర్ఘాయువుకి కీలకం ఆహారమే..
అలా మైక్‌ పూర్తిగా మొక్కల ఆధారిత డైట్‌కి మారాడు. పూర్తిగా తాజా కూరగాయాలు, ఓట్‌మీల్‌ సిరప్‌, బ్లూబెర్రీస్‌, బీన్స్‌, బ్రోకలీ, తాజా పండ్లు తదితరాలను తీసుకునేవాడు. దాంతో రెండున్నర సంవత్సరాల తర్వాత అతడి శరీరంలో ఎలాంటి కేన్సర్‌ కణాలు లేవని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడే అతనికి తెలిసింది ఆరోగ్యానికి కీలకమైనది తీసుకునే పోషకవంతమైన ఆహరమని. 

ఒత్తిడి మత్యు ఒడికి చేర్చేది..
ఒత్తిడి మనల్ని మరణం అంచులకు తీసుకువెళ్తుందని అంటాడు. అందుకే తాను ఒత్తిడి దరిచేరనివ్వని జీవితాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అంతేగాదు ఒత్తిడి సంబంధిత రుగ్మతలు ఎలా మరణ ప్రమాదాన్ని పెంచుతాయో కూడా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేని ప్రశాంత జీవితానికే ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు మైక్‌. 

కసరత్తులు..
మైక్ మునుపటి వ్యాయామ నియమావళి ప్రకారం.. వారానికి మూడు సార్లు 10 మైళ్లు పరిగెత్తేవాడు. కానీ ఇప్పుడు..వారానికి మూడు సార్లు 5 మైళ్లు పరిగెత్తేలా కుదించాడు. బాగా వేడిగా వాతావరణం ఉంటే..కనోయింగ్‌ వంటివి చేస్తాడు..అంటే బోటింగ్‌ లాంటి ప్రక్రియ ఇది కూడా ఒకవిధమైన క్రీడ, పైగా వ్యాయామానికి ఒక కసరత్తులాంటిది. 

దుఃఖాన్ని అధిగమించేందుకు..
తన మొదటి భార్య రక్తస్రావం కారణంగా చనిపోయిందట. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు 36 ఏళ్ల వయసులో పరుగుని ప్రారంభించాడట. దుఃఖాన్ని ఎదుర్కోవడానికి వ్యాయామం మంచి మార్గం అని అంటాడు. 

అకాల మరణాలతో ..
అలాగే కాలేయ కేన్సర్‌తో 69 ఏళ్ల తండ్రి, 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో తల్లి మరణించటంతో ఆహారం, వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నాని..అదే ఇన్నేళ్లు ఆరోగ్యంగా బతికేందుకు దోహదపడిందని అన్నారు. 

దీర్ఘాయువుకి కారణం..
తాను వాతావరణ కార్యకర్తగా పనిచేస్తుంటానని అన్నారు మైక్‌.  భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత భూమిని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నానని అన్నారు. ఆ ఆకాంక్ష వందేళ్లు పైగా ఆరోగ్యంగా బతికేందుకు కారణమైందని అన్నారు. 

సత్సంబంధాలను కలిగి ఉండటం..
మైక్‌ వారానికి మూడుసార్లు తన స్నేహితులతో కలిసి మారథాన్‌కి వెళ్తుంటాడట. అలాగే వృద్ధుల కమ్యూనిటీ గ్రూప్‌లో కూడా ఒక మెంబర్‌. అప్పుడప్పుడూ వారితో కలిసి సంభాషిస్తూ ఉంటాడట. దీంతోపాటు తన భార్య, బంధువులతో కూడ కొంత టైం స్పెండ్‌ చేస్తాడట. ఈ సత్సంబంధాలే మనల్ని మరింత కాలం భూమిపై జీవించేలా చేస్తాయని అంటాడు మైక్‌.

(చదవండి: అమీర్‌ఖాన్‌ స్ట్రిక్ట్‌ డైట్‌ రూల్స్‌..! విస్తుపోయిన్ షారుఖ్‌ దంపతులు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement