మన భూమి అందంగా ఉంటుంది… కానీ ప్రతి అందం వెనక ఒక ప్రమాదం కూడా దాగి ఉంటుంది. ఇప్పడు మనం ప్రపంచంలో కొన్ని డేంజరస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం..
బ్రెజిల్ తీరానికి దగ్గర్లో ఉన్న స్నేక్ ఐస్‌లాండ్. అధికారికంగా దీన్ని క్యుమాడా గ్రాండే దీవి అంటారు. ఇక్కడ అడుగుపెట్టడం అంటే ప్రాణాలతో జూదం ఆడినట్టే. ఎందుకంటే ఈ చిన్న దీవిలో వేల సంఖ్యలో విషసర్పాలు నివసిస్తుంటాయి. ప్రతి అడుగుకీ ఒక పాము కనిపించేంత భయానక పరిస్థితి. అందుకే సాధారణ ప్రజలకు ఇక్కడికి వెళ్లడానికి పూర్తిగా నిషేధం.
ఇప్పుడు మన ప్రయాణం హిందూ మహాసముద్రం వైపు… అక్కడ ఉంది నార్త్ సెంటినెల్ ఐస్‌లాండ్.. ఇది భారతదేశంలోని అండమాన్ దీవుల్లో ఒకటి. కానీ ఈ దీవి ప్రపంచానికి పూర్తిగా వేరు పడిపోయింది. ఇక్కడ నివసించే సెంటినలీస్ గిరిజనులు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం కోరుకోరు. ఎవరు దగ్గరైనా ప్రతిఘటిస్తారు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్, ప్రమాదకర ప్రాంతంగా మారింది.
ఇక భూమి పై అత్యంత డేంజరస్ ప్రదేశాలలో ఒకటి దనాకిల్ లోయ. అత్యంత వేడి ప్రదేశం ఇదే.. ఇది ఎథియోపియాలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటేస్తాయి. ఆమ్లపు సరస్సులు, గంధక వాసన, పోంగే లావా … భూమి మీదనే నరకం ఉందా అనిపించే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.
ఆఫ్రికాలోనే మరో భయానక తీరం స్కెల్టెన్ కోస్ట్. ఇక్కడ సముద్ర అలలు, పొగమంచు కలిసి ఎన్నో నౌకలను మింగేశాయి. తీరానికి కొట్టుకొచ్చిన నౌకల శిధిలాలు, జంతువుల ఎముకలు ఈ ప్రాంతానికి “స్కెలిటన్ కోస్ట్” అనే పేరు ను తీసుకొచ్చాయి.
ఇప్పుడు దక్షిణ అమెరికా వైపు… బొలీవియాలోని డెత్ రోడ్(. సన్నని రహదారి, ఒకవైపు లోయ, మరోవైపు కొండచరియలు… చిన్న తప్పిదం ప్రాణాలను తీసేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారి అంటారు.
మిస్టరీ అంటే గుర్తుకొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయని కథలు ఉన్నాయి. నిజమో కాదో అనుమానాలే కానీ… బెర్ముడా ట్రయాంగిల్ వైపు ఎటువంటి ఫ్లైట్‌లు కానీ .. షిప్ లు గానీ వెళ్లవు ..
రష్యాలోని మంచు రాజ్యం ఒయ్మ్యాకాన్. ప్రపంచంలోనే అత్యంత చలికాలం నమోదు అయిన గ్రామం ఇది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50°C కంటే తక్కువకు పడిపోతాయి. ఊపిరి కూడా మంచుగా మారేంత చలి!
చివరిగా అమెరికాలోని డెత్ వాలీ. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం. ఇక్కడ వేసవిలో జీవించడం అంటే అగ్నిపర్వతం మధ్య లో నిలబడ్డట్టే.
ఇలా చూస్తే… భూమి మనకు స్వర్గంలా అనిపించినా, కొన్ని ప్రాంతాలు మాత్రం నరకం కన్నా భయంకరంగా ఉంటాయి. ప్రకృతి అందం ఎంత గొప్పదో… అలాగే ప్రకృతి అంతే భయంకరం కూడా.


