breaking news
dangerious
-
ప్రకృతి అందం ఎంత గొప్పదో.. అంతే భయంకరం కూడా..!
మన భూమి అందంగా ఉంటుంది… కానీ ప్రతి అందం వెనక ఒక ప్రమాదం కూడా దాగి ఉంటుంది. ఇప్పడు మనం ప్రపంచంలో కొన్ని డేంజరస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం..బ్రెజిల్ తీరానికి దగ్గర్లో ఉన్న స్నేక్ ఐస్లాండ్. అధికారికంగా దీన్ని క్యుమాడా గ్రాండే దీవి అంటారు. ఇక్కడ అడుగుపెట్టడం అంటే ప్రాణాలతో జూదం ఆడినట్టే. ఎందుకంటే ఈ చిన్న దీవిలో వేల సంఖ్యలో విషసర్పాలు నివసిస్తుంటాయి. ప్రతి అడుగుకీ ఒక పాము కనిపించేంత భయానక పరిస్థితి. అందుకే సాధారణ ప్రజలకు ఇక్కడికి వెళ్లడానికి పూర్తిగా నిషేధం.ఇప్పుడు మన ప్రయాణం హిందూ మహాసముద్రం వైపు… అక్కడ ఉంది నార్త్ సెంటినెల్ ఐస్లాండ్.. ఇది భారతదేశంలోని అండమాన్ దీవుల్లో ఒకటి. కానీ ఈ దీవి ప్రపంచానికి పూర్తిగా వేరు పడిపోయింది. ఇక్కడ నివసించే సెంటినలీస్ గిరిజనులు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం కోరుకోరు. ఎవరు దగ్గరైనా ప్రతిఘటిస్తారు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్, ప్రమాదకర ప్రాంతంగా మారింది.ఇక భూమి పై అత్యంత డేంజరస్ ప్రదేశాలలో ఒకటి దనాకిల్ లోయ. అత్యంత వేడి ప్రదేశం ఇదే.. ఇది ఎథియోపియాలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటేస్తాయి. ఆమ్లపు సరస్సులు, గంధక వాసన, పోంగే లావా … భూమి మీదనే నరకం ఉందా అనిపించే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.ఆఫ్రికాలోనే మరో భయానక తీరం స్కెల్టెన్ కోస్ట్. ఇక్కడ సముద్ర అలలు, పొగమంచు కలిసి ఎన్నో నౌకలను మింగేశాయి. తీరానికి కొట్టుకొచ్చిన నౌకల శిధిలాలు, జంతువుల ఎముకలు ఈ ప్రాంతానికి “స్కెలిటన్ కోస్ట్” అనే పేరు ను తీసుకొచ్చాయి.ఇప్పుడు దక్షిణ అమెరికా వైపు… బొలీవియాలోని డెత్ రోడ్(. సన్నని రహదారి, ఒకవైపు లోయ, మరోవైపు కొండచరియలు… చిన్న తప్పిదం ప్రాణాలను తీసేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారి అంటారు.మిస్టరీ అంటే గుర్తుకొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయని కథలు ఉన్నాయి. నిజమో కాదో అనుమానాలే కానీ… బెర్ముడా ట్రయాంగిల్ వైపు ఎటువంటి ఫ్లైట్లు కానీ .. షిప్ లు గానీ వెళ్లవు ..రష్యాలోని మంచు రాజ్యం ఒయ్మ్యాకాన్. ప్రపంచంలోనే అత్యంత చలికాలం నమోదు అయిన గ్రామం ఇది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50°C కంటే తక్కువకు పడిపోతాయి. ఊపిరి కూడా మంచుగా మారేంత చలి!చివరిగా అమెరికాలోని డెత్ వాలీ. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం. ఇక్కడ వేసవిలో జీవించడం అంటే అగ్నిపర్వతం మధ్య లో నిలబడ్డట్టే.ఇలా చూస్తే… భూమి మనకు స్వర్గంలా అనిపించినా, కొన్ని ప్రాంతాలు మాత్రం నరకం కన్నా భయంకరంగా ఉంటాయి. ప్రకృతి అందం ఎంత గొప్పదో… అలాగే ప్రకృతి అంతే భయంకరం కూడా. -
కిమ్ సోదరి యో జోంగ్ ఎందుకంత డేంజర్? ‘ది సిస్టర్’లో ఏముంది?
ఈ మధ్యనే ‘ది సిస్టర్’ అనే పుస్తకం వెలువడింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఎలా మారిందో ఈ పుస్తకంలో రాశారు. కిమ్ యో జోంగ్ అత్యంత క్రూరమైన మహిళ అని, ఆమెను చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళ అని పిలవడం తప్పు కాదని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరికి సంబంధించిన మొదటి ఫొటో 90వ దశకం ప్రారంభంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సమయంలో బయటకు వచ్చింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు. తాజాగా నార్త్ కొరియా మూలాలు కలిగి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్ యూన్ లీ ఓ పుస్తకం రాసి, దానిలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా కిమ్ యో జోంగ్ ఎలా మారిందో తెలియజేశారు. ఆ పుస్తకం పేరు ‘ది సిస్టర్’ ట్యాగ్ లైన్‌గా ‘నార్త్ కొరియా కిమ్ యో జోంగ్, ది మోస్ట్ డేంజరస్ ఉమెన్’ అని రాశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఆరోగ్యం క్షీణించడంతో సోదరి కిమ్ యో జోంగ్కు పాలనా పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ తరచూ వినిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె ఏకైక చెల్లెలు. కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియా పాలనలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. నిరంతరం సోదరుడిని పక్కనే కనిపిస్తారు. ఇటీవల ఆమె సోదరుడు కిమ్ జోంగ్‌తో కలిసి రష్యా వెళ్లారు. అక్కడ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సోదరునికి సహాయం చేశారు. పుస్తకం రచయిత, వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ సభ్యులు సుంగ్-యున్ లీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడైనా ఖాళీ అయితే, వెంటనే ఆమె ఈ పదవిని చేపట్టి నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా ఆమె తన సోదరునికి అడుగడుగునా అండగా నిలిచారని పుస్తకంలో రాశారు. ఆమెకు తన సోదరుని ప్రతి రహస్యం తెలుసని, అతని మామ హత్యలో కనికరం లేకుండా తన సోదరునికి అండగా నిలిచారని పుస్తకంలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఒక క్లోజ్డ్ సొసైటీ. దేశంలో నమ్మదగిన సమాచారాన్ని పొందడం దాదాపు అసాధ్యం. కానీ ఈ పుస్తకంలో నియంత సోదరి గురించి పరిశోధించిన అంశాలను పేర్కొన్నారు. 2020లో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఆమె దేశంలోని అన్ని వ్యవహారాలను చూసుకుంటుంటున్నారని ఆ పుస్తకం తెలియజేసింది. దక్షిణ కొరియాలోని గాంగ్నెంగ్లో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జోంగ్ మహిళల ఐస్ హాకీ గేమ్‌లో పోటీ పడింది. దక్షిణ కొరియాలో ఆమె స్నేహపూర్వక ప్రవర్తనను చూపినప్పుడు జనం ఆమెను చూసి గర్వపడ్డారు. ఈ నేపధ్యంలో ఆమెను అందరూ రాజకుమారి అని ప్రశంసించారు. అయితే అధికార పాలనలో భాగస్వామ్యం దక్కాక ఆమె తన ‘పవర్’ను పెంచుకుంటూ వస్తోంది. కాగా ఆమె పాంపర్డ్ లగ్జరీలో పెరిగిందని పుస్తకంలో రాశారు. ఆమెను మొదటి నుంచి నిబంధనలకు అతీతంగా పెంచారు. సోదరునిలాగే ఆమె స్విస్ బోర్డింగ్ స్కూల్లో కొన్నేళ్లు చదువుకున్నారు. ఆమెకు కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం ఉందని పుస్తకంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి కిమ్ జోంగ్ సింగపూర్ వచ్చినప్పుడు, ఆమె తన సోదరునితో పాటు అక్కడే ఉంది. కిమ్ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెను దేశంలోని కొందరు ‘దెయ్యం మహిళ’, ‘అహంకార యువరాణి’,‘సహ నియంత’ అని పిలుస్తుంటారు. ఉత్తర కొరియాలోని 25 మిలియన్ల మంది పౌరులు కిమ్ కుటుంబాన్ని ఆరాధిస్తుంటారని, వారు సాగించే అవినీతి గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తారని పుస్తకంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు? -
డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు
ఉయ్యూరు : మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్ జ్వరాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగటి దోమలతోనే డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో 120 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ్వరం వస్తే ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్సీలో వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వైద్యులు బాలకృష్ణ, శోభ పాల్గొన్నారు.


