‘కండోమ్‌లు కొనడానికి డబ్బుల్లేవు’ | Pakistan Economic Situation, IMF Refuses Pak Request To Lower Condom Prices Amid Economic Crisis | Sakshi
Sakshi News home page

‘కండోమ్‌లు కొనడానికి డబ్బుల్లేవు’

Feb 17 2026 2:14 PM | Updated on Feb 17 2026 4:17 PM

Pakistan economic situation No money to buy condoms

ఈ మాటలు అన్నది మరెవరో కాదు పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు

ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు పెరుగుతున్న జనాభా

అంతకంతకూ పెరుగుతున్న పేదరికం 

జనాభా నియంత్రణ కోసం పాక్‌ ప్రభుత్వం మల్లగుల్లాలు 

గర్భనిరోధాకాలైన కండోమ్‌ల ధర తగ్గించేందుకు ప్రయత్నం

విధాన పరమైన నిర్ణయాల కారణంగా కుదరని కండోమ్‌ ధరల తగ్గింపు

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మీడియా ముందు వాపోయిన పాక్‌ మంత్రి 

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఈ దేశం పేరు వింటే చాలు సీమాంతర ఉగ్రవాదం, హింస, మతతత్వవాదం ఇవే గుర్తుకొస్తాయి. భారత్‌తో సమకాలీకంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఆ దేశం హింసనే నమ్ముకుంది. పక్క దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ హింసతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేసే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అభివృద్ధిని మరచిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు కండోమ్‌లు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బపడుతుంది. ఇటీవల భారత్‌, ఈయూతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అక్కడి ఎగుమతులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వార్త ఆ దేశాన్ని కలవర పెడుతోంది. అయితే పాకిస్థాన్‌లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా జననాలు జరుగుతున్నాయని తద్వారా పేదరికం సంభవిస్తుందని కనుక పేదరికాన్ని నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.

అందుకోసమే గర్భనిరోధాకాలైన కండోమ్‌ల ధర తగ్గించాలని భావించారు. అయితే ప్రస్తుతం పాక్‌కు ఐఎమ్‌ఎఫ్‌ ఆర్థిక సాయం అందిస్తుండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో దాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ధరలు తగ్గించాలని ఐఎమ్‌ఎఫ్‌ను కోరగా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా పన్నులు తగ్గించడం సాధ్యం కాదని అవసరమైతే వచ్చే ఏడాది బడ్జెట్‌లో కోతలు విధించాలని తెలిపింది. దీంతో కండోమ్‌ల ధర తగ్గించలేకపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు మీడియాకు తెలిపారు.

ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో పాకిస్థాన్ అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వ్యవస్తలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాలని సర్వే తెలిపింది. పాక్‌ జనాభా త్వరలో 40 కోట్లకు చేరుకుంటుంది. అయితే  అభివృద్ధిలో ఆ దేశం వెనుకబాటులో ఉంది. ఆ దేశ మెుత్తం ఐటీ ఎగుమతులు మన కేరళతో పోలిస్తే తక్కువ ఉ‍న్నాయంటే టెక్నాలజీలో పాక్‌ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement