breaking news
Condom pill
-
‘కండోమ్‌లు కొనడానికి డబ్బుల్లేవు’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఈ దేశం పేరు వింటే చాలు సీమాంతర ఉగ్రవాదం, హింస, మతతత్వవాదం ఇవే గుర్తుకొస్తాయి. భారత్‌తో సమకాలీకంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఆ దేశం హింసనే నమ్ముకుంది. పక్క దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ హింసతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేసే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అభివృద్ధిని మరచిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు కండోమ్‌లు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బపడుతుంది. ఇటీవల భారత్, ఈయూతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అక్కడి ఎగుమతులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వార్త ఆ దేశాన్ని కలవర పెడుతోంది. అయితే పాకిస్థాన్‌లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా జననాలు జరుగుతున్నాయని తద్వారా పేదరికం సంభవిస్తుందని కనుక పేదరికాన్ని నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.అందుకోసమే గర్భనిరోధాకాలైన కండోమ్‌ల ధర తగ్గించాలని భావించారు. అయితే ప్రస్తుతం పాక్‌కు ఐఎమ్ఎఫ్ ఆర్థిక సాయం అందిస్తుండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో దాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ధరలు తగ్గించాలని ఐఎమ్ఎఫ్ను కోరగా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా పన్నులు తగ్గించడం సాధ్యం కాదని అవసరమైతే వచ్చే ఏడాది బడ్జెట్లో కోతలు విధించాలని తెలిపింది. దీంతో కండోమ్‌ల ధర తగ్గించలేకపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు మీడియాకు తెలిపారు.ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో పాకిస్థాన్ అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వ్యవస్తలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాలని సర్వే తెలిపింది. పాక్ జనాభా త్వరలో 40 కోట్లకు చేరుకుంటుంది. అయితే అభివృద్ధిలో ఆ దేశం వెనుకబాటులో ఉంది. ఆ దేశ మెుత్తం ఐటీ ఎగుమతులు మన కేరళతో పోలిస్తే తక్కువ ఉన్నాయంటే టెక్నాలజీలో పాక్ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
గర్భనిరోధక మాత్రతోనే క్యాన్సర్‌కూ చెక్!
ఎంతో సంతోషదాయకమైన సైడ్ఎఫెక్ట్ ఇది. గర్భనిరోధక మాత్ర ఎంత సురక్షితమైనా ఎప్పుడైనా దానిపై కొన్ని అనుమానాలు ఉండనే ఉంటాయి. ఎన్నో క్యాన్సర్లనూ రక్షించడమే ఇప్పుడు గర్భనిరోధక పిల్ తాలూకు ‘సైడ్ఎఫెక్ట్’ అని తెలిస్తే... ఆ సైడ్ఎఫెక్ట్ పట్ల ఎంత ఆనందం! స్కాట్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ పరిశోధకులు కనుగొన్న ఒక కొత్తరకం గర్భనిరోధక మాత్రతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. అది అవాంఛిత గర్భాన్ని నివారించడమే కాకుండా... ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందని పేర్కొంటున్నారు దాన్ని రూపొందిస్తున్న పరిశోధకులు. ‘‘అయితే దీనిలోని కొన్ని అంశాలు రొమ్ము, సర్వికల్ క్యాన్సర్లను ప్రేరేపించేలా ఉన్నాయి. కాకపోతే పిల్ మానేయగానే ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. అయినప్పటికీ ఆ సమస్యలను అధిగమించేలా దీన్ని రూపొందిస్తే... దీర్ఘకాలంలో దీనితో ఎన్నో ప్రయోజనాలు సాధించే అవకాశాలు ఉంటాయ’’ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ లీసా ఐవర్సెన్ పేర్కొంటున్నారు. ‘‘ఇది భవిష్యత్తులో చాలామంది మహిళలకు ఒక వరంకానుంది’’ అని ద చైర్ ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ జీపీస్ అయిన ప్రొఫెసర్ హెలెన్ స్ట్రోక్స్– ల్యాంపర్డ్ చెబుతున్నారు.


