గర్భనిరోధక మాత్రతోనే క్యాన్సర్‌కూ చెక్‌! | Check the cancer in Condom pill | Sakshi
Sakshi News home page

గర్భనిరోధక మాత్రతోనే క్యాన్సర్‌కూ చెక్‌!

Jun 4 2017 12:06 AM | Updated on Sep 5 2017 12:44 PM

గర్భనిరోధక మాత్రతోనే క్యాన్సర్‌కూ చెక్‌!

గర్భనిరోధక మాత్రతోనే క్యాన్సర్‌కూ చెక్‌!

ఎంతో సంతోషదాయకమైన సైడ్‌ఎఫెక్ట్‌ ఇది. గర్భనిరోధక మాత్ర ఎంత సురక్షితమైనా ఎప్పుడైనా దానిపై కొన్ని అనుమానాలు ఉండనే ఉంటాయి.

ఎంతో సంతోషదాయకమైన సైడ్‌ఎఫెక్ట్‌ ఇది. గర్భనిరోధక మాత్ర ఎంత సురక్షితమైనా ఎప్పుడైనా దానిపై కొన్ని అనుమానాలు ఉండనే ఉంటాయి. ఎన్నో క్యాన్సర్లనూ రక్షించడమే ఇప్పుడు గర్భనిరోధక పిల్‌ తాలూకు ‘సైడ్‌ఎఫెక్ట్‌’ అని తెలిస్తే... ఆ సైడ్‌ఎఫెక్ట్‌ పట్ల ఎంత ఆనందం! స్కాట్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అబర్‌డీన్‌ పరిశోధకులు కనుగొన్న ఒక కొత్తరకం గర్భనిరోధక మాత్రతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట.

 అది అవాంఛిత గర్భాన్ని నివారించడమే కాకుండా... ఒవేరియన్‌ క్యాన్సర్, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందని పేర్కొంటున్నారు దాన్ని రూపొందిస్తున్న పరిశోధకులు. ‘‘అయితే దీనిలోని కొన్ని అంశాలు రొమ్ము, సర్వికల్‌ క్యాన్సర్లను ప్రేరేపించేలా ఉన్నాయి. కాకపోతే పిల్‌ మానేయగానే ఆ రిస్క్‌ కూడా తగ్గుతుంది.

 అయినప్పటికీ ఆ సమస్యలను అధిగమించేలా దీన్ని రూపొందిస్తే... దీర్ఘకాలంలో దీనితో ఎన్నో ప్రయోజనాలు సాధించే అవకాశాలు ఉంటాయ’’ని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ లీసా ఐవర్సెన్‌ పేర్కొంటున్నారు. ‘‘ఇది భవిష్యత్తులో చాలామంది మహిళలకు ఒక వరంకానుంది’’ అని ద చైర్‌ ఆఫ్‌ రాయల్‌ కాలేజీ ఆఫ్‌ జీపీస్‌ అయిన ప్రొఫెసర్‌ హెలెన్‌ స్ట్రోక్స్‌– ల్యాంపర్డ్‌ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement