
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. పాత్ర కోసం ఏం చేసేందుకైనా వెనుకాడని వ్యక్తిత్వం అమీర్‌ది. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. ఆయన ఆరు పదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని విధంగా స్టైలిష్ లుక్ కనిపిస్తుంటాడు. అతని ఫిట్‌నెస్ బాడీ చూస్తే..అంత ఏజ్ ఉంటుందని అనిపించదు. అంతలా ఎలా మెయింటైన్ చేస్తారనే సందేహం కలగకమానదు. అంతేగాదు డైట్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఆయనే స్వయంగా డైట్ విషయంలో ఎంతలా కమిట్‌మెంట్‌గా ఉంటారో ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆ నిబద్ధత చూసి..షారుఖ్ తన భార్య గౌరి ఇద్దరూ కూడా విస్తుపోయారని అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా.
సరిగ్గా దంగల్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం. అయితే ఆ టైంలోనే షారుఖ్ ఇంటికి ఆపిల్‌కు చెందిన టిమ్ కుక్ తోపాటు అమెరికా నుంచి నలుగురు ప్రముఖులు వచ్చారు. ఆ నేపథ్యంలో మమ్మల్ని అందరిని విందుకు ఆహ్వానించాడు షారుఖ్. విందు చేయకుండా వెళ్లవద్దని గౌరీ మరీ మరీ చెప్పిందట అమీర్‌కి.
అందుకు అమీర్ కూడా కచ్చితంగా తినే వెళ్తానని అన్నారట. సరిగ్గా అంతా విందుకు కూర్చొన్నప్పుడు..ఆహారం సిద్ధం చేశామని, తినమని చెప్పగా..వెంటనే అమీర్ తన దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది వద్దని చెప్పారట. అదేంటి మా ఇంటికి వచ్చి..టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నావా..అని ఆశ్యర్యపోతూ అడిగారట షారుఖ్ దంపతులు.
అందుకు అమీర్ మనలో మనకి ఫార్మాలిటీ ఏముంది..ప్రస్తుతం తాను దంగల్ మూవీ కోసం డైట్‌లో ఉన్నానంటూ..తాను తెచ్చుకున్న బాక్సే తిన్నానని ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. దీని గురించి షారుక్‌ని అడిగినా కచ్చితంగా చెబుతాడంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు అమీర్.
అలాంటి కమిట్‌మెంట్ తప్పక ఉండాలి..
స్మార్ట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ పార్టీలకి అటెండైనా..మీ బాక్స్ తెచ్చుకుంటే..ఫుడ్‌పై కంట్రోల్ ఉంటుందట. అనుకున్న విధంగా బరువు అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల అనారోగ్యకరమైన చక్కెరలు, కొవ్వులకు దూరంగా ఉంటామట. అలాగే మన బరువు తగ్గించే లక్ష్యానికి ఆటంకం రాదు అని చెబుతున్నారు నిపుణులు.
మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడానికి సరైన ఉదాహారణ ఈ విధానమేనని అంటున్నారు. ఇది సమతుల్య జీవనశైలి తోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాడానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా మీరు ఉండాల్సిన ఆకృతిలో బాడీ మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించేలా అమీర్ ఖాన్ స్ట్రిట్ డైట్‌ని ఫాలో అయిపోండి. అమీర్‌ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..
(చదవండి: లైట్ తీస్కో భయ్యా..!)