లైట్‌ తీస్కో భయ్యా..! | Boycott of Turkish cuisine in the Hyderabad city | Sakshi
Sakshi News home page

లైట్‌ తీస్కో భయ్యా..!

May 23 2025 9:32 AM | Updated on May 23 2025 12:56 PM

Boycott of Turkish cuisine in the Hyderabad city

‘ఇదిగోండి సార్‌ మీ ఫుడ్‌...’  ‘ఏమిటిది?’ ‘అదే సార్‌.. మీరు బాగా ఎంజాయ్‌ చేసే టర్కిష్‌ డిలైట్‌’ ‘సారీ.. నేనిప్పుడు టర్కీ ఫుడ్‌ తినడం లేదు.. ప్లీజ్‌ క్యాన్సిల్‌’ ‘అదేంటి మీకు ఈ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం కద సార్‌..’ ‘లైట్‌ తీస్కో భయ్యా..!’ ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలు హైదరాబాద్‌నగరంలోని రెస్టారెంట్స్‌లో సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు టర్కీ వంటకాలంటే లొట్టలేసుకుని తినే సిటీ ఫుడ్‌ లవర్స్‌ ఇప్పుడు టర్కీ ఫుడ్‌ అంటే పీచే ముడ్‌ అంటున్నారు. దీంతో గత కొంత కాలంగా టర్కిష్‌ రుచులపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్న పలు రెస్టారెంట్స్‌ వెలవెలబోతున్నాయి.  

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలో గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు ఫుల్‌ డిమాండ్‌. అత్యంత ఆదరణ పొందుతున్న సిటీలోని విదేశీ క్యుజిన్స్‌లో ఇటలీ వంటకాల తరహాలోనే టర్కీ వెరైటీస్‌కి కూడా మంచి క్రేజ్‌ ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి టర్కీ వంటకాలను అందించే రెస్టారెంట్లు నగరమంతా విస్తరించాయి. అయితే తాజాగా సరిహద్దుల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో బాయ్‌ కాట్‌ టర్కీ ఉద్యమంలో నగరంలోని టర్కీ ఫుడ్‌ లవర్స్‌ కూడా మేము సైతం అంటున్నారు. 

టర్కీ పేరుతో ఉన్న వంటకాలను తినబోం అంటూ వారు తెగేసి చెబుతుండడంతో నగరంలో సదరు వంటకాలకు డిమాండ్‌ సగానికి పడిపోయింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సాన్‌ సెబాస్టియన్‌ చీజ్‌కేక్‌ నుంచి టర్కీ టీ దాకా పేరు వింటనే సై అనే నగరవాసులు ఇప్పుడ నై అంటుండడంతో రెస్టారెంట్ల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. 

ఎన్నో కేఫ్స్, రెస్టారెంట్స్‌.. 
నగరంలో అత్యంత తొలిగా తుర్కీ వంటకాలు అందించడం ప్రారంభించిన రెస్టారెంట్‌ బంజారాహిల్స్‌లోని లెవంట్‌గా చెప్పొచ్చు. ఇక్కడి  లెవంట్‌ మషావీ ముషక్కల్, బుర్జ్‌ దజాజ్, మనకీష్‌, తజీన్‌ దజాజ్‌ వంటివన్నీ నగరవాసుల ఆదరణకు నోచుకున్నవే. 

అదే విధంగా బెంగళూరు నుంచి వచ్చిన మరో టర్కీ రెస్టారెంట్‌ కెబెప్సీ సైతం వెరైటీల మెనూతో టర్కీ ఫుడ్‌ లవర్స్‌కు చిరునామాగా ఉండేది. ఇక్కడి బెయ్తీ చికెన్,  లాంబ్‌ మండీ, జిహాన్‌ కబాబ్‌ వంటివి బాగా ఫేమస్‌.  ఇక టోలీచౌకిలోని కెబాబ్‌జాదెహ్‌ సంప్రదాయ టర్కీ  వంటకాలకు పేరొందింది. చీజ్‌ ఖీమా నాన్, గ్రీక్‌ చికెన్,  ఇజి్మర్‌ చికెన్, లాంబ్‌ చాప్స్‌తో నోరురిస్తుంది. టర్కీ టీ, రెడ్‌ సెంటిల్‌ సూప్‌లకు పేరొందిన జౌక్, పిలాఫ్‌ ప్లాటర్, లహ్మకున్‌ తదితర టర్కీ స్ట్రీట్‌ ఫుడ్‌కి బెస్ట్‌గా పేరొందింది.  

వివిధ వెరైటీలు.. 
నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇస్తాంబుల్, టర్కిష్‌ డిలైట్, టర్కీ మిల్క్‌ కేక్స్‌ తదితర టర్కీ స్వీట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన గోర్మేట్‌ బక్లావా, టర్కీ బ్రేక్‌ ఫాస్ట్‌ అందించే జూబ్లీహిల్స్‌లోని కార్డ్‌ యార్డ్‌ కేఫ్‌.. టర్కీ డెజర్ట్‌ కునాఫాలకు పేరొందిన కెపె్టన్‌ కునాఫా, టర్కీ షావర్మాతో ఆకట్టుకునే మల్లేపల్లిలోని టర్కిష్‌ సెంట్రల్‌.. కెబాబ్‌ క్రాలిక్‌ తదితర రెస్టారెంట్స్, కేఫ్స్‌ గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు పేరొందాయి.

రణ వేళ.. రుచుల వెలవెల.. 
‘టర్కీ వంటకాలు అంటే అక్కడ నుంచి దిగుమతి అయినవి కాదు. కేవలం అక్కడి స్టైల్‌ను అనుసరించి మేము సొంతంగా తయారు చేసేవి మాత్రమే’ అంటూ పలు రెస్టారెంట్స్‌ అతిథులకు, భోజన ప్రియులకు సర్థి చెప్పాల్సిన పరిస్థితి నగరంలో ఏర్పడిందని ఓ చెఫ్‌ ‘సాక్షి’కి వివరించారు. 

అంతేకాకుండా మెనూలోని వంటకం పేరు ముందు టర్కీ తొలగించడం వంటి మార్పు చేర్పులు కూడా చేసుకుంటున్నామని పలువురు రెస్టారెంట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఏదేమైనా.. వంటకాల పట్ల అనూహ్యంగా ఏర్పడిన ఈ వ్యతిరేక ధోరణి కొన్ని రోజులకు సద్ధుమణిగిపోతుందని, టర్కీ ఫుడ్‌కి డిమాండ్‌ ఎప్పటిలా పుంజుకుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   

(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్‌ 900 ఎగ్స్‌ డైట్‌..! చివరికి గంటకు పైగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement