breaking news
Turkish cities
-
అలనాటి మహిళా రాజ్యం..!
పురాతన టర్కిష్ నగరాన్ని 9000 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య సమాజంలో నివసించే స్త్రీలు పాలించారని ఒక కొత్త అధ్యయనం ధ్రువీకరించింది. కాటల్హో యుక్లోలో 35 వేర్వేరు ఇళ్ల నుంచి 130కి పైగా అస్థిపంజరాల డీఎన్ఏను పరిశోధకులు విశ్లేషించారు.జన్యు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, బయోలాజికల్ ఆంత్రోపాలజిస్ట్‌లు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. అస్థిపంజరాల డీఎన్ఏ విశ్లేషణకు అత్యాధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ కాలంలో ప్రతి కుటుంబంలో, వ్యవసాయంలో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. వివాహం తరువాత భర్తలు భార్య ఇంటికి వచ్చేవారు.మరణం తరువాత అంత్యక్రియలకు సంబంధించి పాటించే ఆచారాలలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉండేదని అధ్యయనం తెలియజేసింది. పురుషులతో పోల్చితే స్త్రీల సమాధిలో ఉంచవలసిన వస్తువులు అయిదు రెట్లు ఎక్కువగా ఉండేవి. మాతృస్వామ్య సమాజానికి సంబం«ధించిన చిహ్నాలు, మహిళా ప్రతిమలను భారీ స్థాయిలో కలిగిన ఉన్న కారణంగా కాటల్హో ప్రసిద్ధి పొందింది. కాలానుగుణంగా సంస్కృతిలో వచ్చిన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది.(చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!) -
లైట్ తీస్కో భయ్యా..!
‘ఇదిగోండి సార్ మీ ఫుడ్...’ ‘ఏమిటిది?’ ‘అదే సార్.. మీరు బాగా ఎంజాయ్ చేసే టర్కిష్ డిలైట్’ ‘సారీ.. నేనిప్పుడు టర్కీ ఫుడ్ తినడం లేదు.. ప్లీజ్ క్యాన్సిల్’ ‘అదేంటి మీకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం కద సార్..’ ‘లైట్ తీస్కో భయ్యా..!’ ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలు హైదరాబాద్నగరంలోని రెస్టారెంట్స్‌లో సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు టర్కీ వంటకాలంటే లొట్టలేసుకుని తినే సిటీ ఫుడ్ లవర్స్ ఇప్పుడు టర్కీ ఫుడ్ అంటే పీచే ముడ్ అంటున్నారు. దీంతో గత కొంత కాలంగా టర్కిష్ రుచులపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్న పలు రెస్టారెంట్స్ వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు ఫుల్ డిమాండ్. అత్యంత ఆదరణ పొందుతున్న సిటీలోని విదేశీ క్యుజిన్స్లో ఇటలీ వంటకాల తరహాలోనే టర్కీ వెరైటీస్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి టర్కీ వంటకాలను అందించే రెస్టారెంట్లు నగరమంతా విస్తరించాయి. అయితే తాజాగా సరిహద్దుల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో బాయ్ కాట్ టర్కీ ఉద్యమంలో నగరంలోని టర్కీ ఫుడ్ లవర్స్ కూడా మేము సైతం అంటున్నారు. టర్కీ పేరుతో ఉన్న వంటకాలను తినబోం అంటూ వారు తెగేసి చెబుతుండడంతో నగరంలో సదరు వంటకాలకు డిమాండ్ సగానికి పడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సాన్ సెబాస్టియన్ చీజ్‌కేక్ నుంచి టర్కీ టీ దాకా పేరు వింటనే సై అనే నగరవాసులు ఇప్పుడ నై అంటుండడంతో రెస్టారెంట్ల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఎన్నో కేఫ్స్, రెస్టారెంట్స్.. నగరంలో అత్యంత తొలిగా తుర్కీ వంటకాలు అందించడం ప్రారంభించిన రెస్టారెంట్ బంజారాహిల్స్‌లోని లెవంట్గా చెప్పొచ్చు. ఇక్కడి లెవంట్ మషావీ ముషక్కల్, బుర్జ్ దజాజ్, మనకీష్, తజీన్ దజాజ్ వంటివన్నీ నగరవాసుల ఆదరణకు నోచుకున్నవే. అదే విధంగా బెంగళూరు నుంచి వచ్చిన మరో టర్కీ రెస్టారెంట్ కెబెప్సీ సైతం వెరైటీల మెనూతో టర్కీ ఫుడ్ లవర్స్‌కు చిరునామాగా ఉండేది. ఇక్కడి బెయ్తీ చికెన్, లాంబ్ మండీ, జిహాన్ కబాబ్ వంటివి బాగా ఫేమస్. ఇక టోలీచౌకిలోని కెబాబ్జాదెహ్ సంప్రదాయ టర్కీ వంటకాలకు పేరొందింది. చీజ్ ఖీమా నాన్, గ్రీక్ చికెన్, ఇజి్మర్ చికెన్, లాంబ్ చాప్స్‌తో నోరురిస్తుంది. టర్కీ టీ, రెడ్ సెంటిల్ సూప్‌లకు పేరొందిన జౌక్, పిలాఫ్ ప్లాటర్, లహ్మకున్ తదితర టర్కీ స్ట్రీట్ ఫుడ్‌కి బెస్ట్‌గా పేరొందింది. వివిధ వెరైటీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇస్తాంబుల్, టర్కిష్ డిలైట్, టర్కీ మిల్క్ కేక్స్ తదితర టర్కీ స్వీట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన గోర్మేట్ బక్లావా, టర్కీ బ్రేక్ ఫాస్ట్ అందించే జూబ్లీహిల్స్‌లోని కార్డ్ యార్డ్ కేఫ్.. టర్కీ డెజర్ట్ కునాఫాలకు పేరొందిన కెపె్టన్ కునాఫా, టర్కీ షావర్మాతో ఆకట్టుకునే మల్లేపల్లిలోని టర్కిష్ సెంట్రల్.. కెబాబ్ క్రాలిక్ తదితర రెస్టారెంట్స్, కేఫ్స్ గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు పేరొందాయి.రణ వేళ.. రుచుల వెలవెల.. ‘టర్కీ వంటకాలు అంటే అక్కడ నుంచి దిగుమతి అయినవి కాదు. కేవలం అక్కడి స్టైల్‌ను అనుసరించి మేము సొంతంగా తయారు చేసేవి మాత్రమే’ అంటూ పలు రెస్టారెంట్స్ అతిథులకు, భోజన ప్రియులకు సర్థి చెప్పాల్సిన పరిస్థితి నగరంలో ఏర్పడిందని ఓ చెఫ్ ‘సాక్షి’కి వివరించారు. అంతేకాకుండా మెనూలోని వంటకం పేరు ముందు టర్కీ తొలగించడం వంటి మార్పు చేర్పులు కూడా చేసుకుంటున్నామని పలువురు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఏదేమైనా.. వంటకాల పట్ల అనూహ్యంగా ఏర్పడిన ఈ వ్యతిరేక ధోరణి కొన్ని రోజులకు సద్ధుమణిగిపోతుందని, టర్కీ ఫుడ్‌కి డిమాండ్ ఎప్పటిలా పుంజుకుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
టర్కీలోని ఒక రిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య టర్కీలోని ఒక స్కీ రిసార్ట్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. అతికష్టం మీద అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బోలు ప్రావిన్స్‌లోని కర్తల్కాయ రిసార్ట్‌లోని ఒక రెస్టారెంట్లో రాత్రిపూట మంటలు చెలరేగాయని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. భయంతో భవనం నుంచి దూకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లో 234 మంది అతిథులు బస చేస్తున్నారని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, అయితే ప్రమాదాన్ని గుర్తించి, భవనం నుండి తప్పించుకోగలిగానని హోటల్ సిబ్బంది నెక్మీ కెప్సెట్టుటన్ తెలిపారు. తాను బయటపడ్డాక 20 మంది అతిథులు హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం అందించానని తెలిపారు.హోటల్ బయట ఉన్న కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కర్తాల్కాయ అనేది ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్లు (186 మైళ్ళు) దూరంలో ఉన్న కొరోగ్లు పర్వతాలలోని స్కీ రిసార్ట్. 30 అగ్నిమాపక యంత్రాలు, 28 అంబులెన్స్‌లతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ? -
గ్రేట్ వార్.. అరుదైన ఫొటోలు
-
'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'
కాన్బెర్రా: తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పట్లో అంకారా, ఇస్తాంబుల్వంటి టర్కీ నగరాల పర్యటనకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఉగ్రవాదుల కన్ను ఆ నగరాలపై ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ రెండు నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేశారని, అందుకే తమ పౌరుల ప్రాణాలు కాపాడే దృష్ట్యా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, మరోసారి భారీ పేలుళ్లకు పాల్పడతామని వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయని, బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలతోపాటు మరెన్నింటికో వార్నింగ్స్ ఇచ్చినందున టర్కీ నగర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు హెచ్చరించింది.