
పురాతన టర్కిష్ నగరాన్ని 9000 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య సమాజంలో నివసించే స్త్రీలు పాలించారని ఒక కొత్త అధ్యయనం ధ్రువీకరించింది. కాటల్హో యుక్లోలో 35 వేర్వేరు ఇళ్ల నుంచి 130కి పైగా అస్థిపంజరాల డీఎన్‌ఏను పరిశోధకులు విశ్లేషించారు.
జన్యు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, బయోలాజికల్ ఆంత్రోపాలజిస్ట్‌లు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. అస్థిపంజరాల డీఎన్‌ఏ విశ్లేషణకు అత్యాధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ కాలంలో ప్రతి కుటుంబంలో, వ్యవసాయంలో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. వివాహం తరువాత భర్తలు భార్య ఇంటికి వచ్చేవారు.
మరణం తరువాత అంత్యక్రియలకు సంబంధించి పాటించే ఆచారాలలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉండేదని అధ్యయనం తెలియజేసింది. పురుషులతో పోల్చితే స్త్రీల సమాధిలో ఉంచవలసిన వస్తువులు అయిదు రెట్లు ఎక్కువగా ఉండేవి.
మాతృస్వామ్య సమాజానికి సంబం«ధించిన చిహ్నాలు, మహిళా ప్రతిమలను భారీ స్థాయిలో కలిగిన ఉన్న కారణంగా కాటల్హో ప్రసిద్ధి పొందింది. కాలానుగుణంగా సంస్కృతిలో వచ్చిన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది.
(చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!)