breaking news
state Foundation Day
-
ఉత్తరాఖండ్‌లో హ్యాట్రిక్ సాధించాలి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత అమిత్ షా పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 65కు పైగా స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంగా నిర్దేశించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ‘ముస్లిం విశ్వవిద్యాలయం’కోసం ఆందోళన జరిగిందని గుర్తుచేశారు. నేడు బీజేపీ ప్రభుత్వం అక్రమ ప్రార్థన మందిరాలు, మదర్సాలను తొలగిస్తోందని, ప్రభుత్వ భూములను కాపాడుతోందని తెలిపారు. అంతేకాకుండా, ‘ఉత్తరాఖండ్ గళం’కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీకి చేరాలని అన్నారు. హల్దా్వనిలో 29 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించినప్పుడు రాహుల్ గాంధీ అసహనానికి గురయ్యారని విమర్శించారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఉత్తరాఖండ్‌ను సురక్షితమైన, సంపన్నమైన రాష్ట్రంగా మార్చాలని, ఈ దేవభూమిని దేశ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలన్న తమ ధ్యేయమని అమిత్ షా ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 65కు స్థానాలను బీజేపీ గెలుచుకోవడం తథ్యమన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. -
'ప్రాణాలు పోయినా సరే.. ముక్కలు కానివ్వం'
ముంబై: రాష్ట్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముక్కలు కానిచ్చే ప్రస్తకేలేదని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శివసేన పార్టీ పేర్కొంది. మహారాష్ట్ర ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, మా ప్రాణాలు పోయినా ఒక్కటిగానే ఉండిపోతుందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమగ్రత, సమైక్యత ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, విదర్భ లాంటి ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయవద్దని చర్చిస్తామన్నారు. విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా అన్ని ప్రాంతాల సమైక్యతే మహారాష్ట్ర గొప్పతనమని, ఎల్లప్పుడూ ఒక్కటిగానే కొనసాగేలా చూస్తామని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో శివసేన నేతలు రాష్ట్ర ప్రజలకు ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్రను కాపాడేందుకు పుట్టినపార్టీ శివసేన అని, రాష్ట్ర గౌరవాన్ని, పరువును కాపాడాలని సీఎం ఫడ్నవీస్ ను విజ్ఞప్తి చేస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొన్నారు. త్యాగాలకు, ప్రతిష్టకు మహారాష్ట్ర మారుపేరుగా నిలిచిపోతుందని ఉద్ధవ్ ఠాక్రే వివరించారు.


