ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఈటీ– టెట్)కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందు తున్నారు. ఇది ఉపాధ్యాయుల వృత్తిపర మైన ప్రమాణాలను, బోధన నాణ్యతను ఎలా మెరుగుపరచాలనే అంశాలకు సంబంధించిన ఒక అంశం. 2009లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) సెక్షన్ 23 ఉపాధ్యాయులకు అవసరమైన కనీస అర్హతలను ప్రాధికార సంస్థ అయిన జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ)ని నిర్దేశించాలని సూచించింది. దాని ప్రకారం 2010 ఆగస్టు 23న 1 నుంచి 8 తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హతఉండాలని ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నోటిఫి కేషన్‌కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా ఈ అర్హతను పొందాలని నిర్దేశించడం సమస్యను సంక్లిష్టం చేసింది. వాళ్ళు ఉద్యోగంలో చేరిన సమయానికి లేని నిబంధనలను వారిపై రుద్దడం వివాదం పెరగడానికి కారణమైంది.
2010 ఆగస్టు 23న జారీ చేసిన ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ లోని పేరా 4, నోటిఫికేషన్ కు ముందు నియమితులైన కొన్ని నిర్దిష్ట వర్గాల ఉపాధ్యాయులు అందులో నిర్దేశించిన కనీస అర్హతలను పొందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే పేరా 5 నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ కు ముందే ప్రారంభమై ఆ తర్వాత నియామకం జరిగిన వారికి కూడా రక్షణ కల్పించింది. అయితే, 2017 విద్యా హక్కు చట్ట సవరణ కూడా ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేసింది. ఈ సవరణ, ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ కు ముందే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ అర్హతను పొందాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వలేదు, అర్హతను పొందే సమ యాన్ని 2019 వరకు పొడిగించింది.
దీనిపై ఉపాధ్యాయులు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు. విద్యా హక్కు చట్టం ఆధారంగా ఉపాధ్యాయ విద్యా మండలి నోటిఫికేషన్ విడుదలయ్యింది. కాబట్టి ఉపాధ్యాయ విద్యా మండలి ఇచ్చిన మిన హాయింపు దానికి ఆధారమైన ప్రధాన చట్టమైన విద్యాహక్కు చట్టాన్ని అధిగమించలేదనీ, అందువలన ఉపాధ్యాయ విద్యామండలి నోటిఫికేషన్ కు ముందే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి అర్హత అనీ సుప్రీంకోర్టు 2025 సెప్టెంబరులో తీర్పు ఇచ్చింది. 2026 మే 29న ఇచ్చిన సమీక్షా (రివ్యూ) తీర్పు కూడా దీనిని పునరుద్ఘాటించింది. కాకపోతే అర్హత పొందడానికి గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది.
టెట్ ఉపాధ్యాయుల జ్ఞానం, బోధనా విధానాలపై వారి అవగాహనలోని కొన్ని అంశాలను అంచనా వేయగలదు. కాని ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మాత్రమే సమర్థవంతమైన బోధన సాధ్యం కాదు. విషయ పరిజ్ఞానం, బోధనా నిర్ణయాలు తీసు కునే సామర్థ్యం, పిల్లలతో సంబంధాలు, సహచర ఉపాధ్యాయు లతో సహకారం, నిరంతర అభ్యాసం వంటి అనేక అంశాలుఉంటాయి. కేవలం బహుళైచ్ఛిక ప్రశ్నల పరీక్ష ద్వారా ఈ అంశాలను పూర్తిగా అంచనా వేయడం సాధ్యం కాదు. ఉపాధ్యాయ విద్యాసంస్థలు చాలా కాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటు న్నాయి. తగినంతమంది అధ్యాపకులు లేకపోవడం, పాఠశాలల్లో ఆచరణా త్మక శిక్షణ బలహీనంగా ఉండటం, ఉపాధ్యాయ విద్య వాణిజ్యీకరణ వంటి సమస్యలు ఉన్నాయి. సమస్య వృత్తిపరమైన శిక్షణలో లోపం అయితే, దానికి పరిష్కారం కేవలం టెట్ లాంటి పరీక్షలే కాకూడదు.
తమిళనాడు శాసన సభ తీర్మానం
ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు 25న తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహా యించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానం కోరింది. ఇందుకోసం విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలనీ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తగిన చర్యలు తీసుకోవాలనీ కోరింది. ఒక అర్హత ఉండాలనే నిబంధన అమల్లోకి రాకముందే, చట్టబద్ధంగా నియమించబడిన ఉపాధ్యాయులపై కొత్త అర్హతను ఇప్పుడు విధించడం న్యాయమేనా? అనే ప్రశ్నను ఇది ముందుకు తెస్తోంది.
తమిళనాడు నుంచి వచ్చిన డిమాండ్ సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని సూచిస్తోంది. 2010 ఆగస్టు 23కు ముందు నియ మితులైన ఉపాధ్యాయులకు ప్రత్యేక రక్షణ కల్పించవచ్చు. అంటే, ఉద్యోగంలో కొనసాగడానికి వారి నియామక సమయంలో లేని అర్హతను ఇప్పుడు పొందాలనే నిబంధన ఉండకూడదు. దీనర్థం ఈ ఉపాధ్యాయులను జవాబుదారీతనం నుంచి పూర్తిగా మినహాయించడం కాదు. దీనికి బదులుగా వారి వృత్తిపరమైన అభివృద్ధికి మార్గదర్శకత్వం, నిరంతర శిక్షణ, సహచర ఉపాధ్యాయుల ద్వారా అభ్యాసం, ఇతర విధానాల ద్వారా మద్దతు ఇవ్వవచ్చు.
ఇది వృత్తిపరమైన ప్రమాణాలకు వ్యతిరేకమైన వాదన కాదు. ప్రస్తుత సర్వీస్ నిబంధనలను వెనుకటి తేదీ నుంచి రుద్దకూడదన్న వాదన. అందువల్ల, శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత చట్టపర మైన నిబంధనలను పార్లమెంట్ పునఃపరిశీలించవచ్చు. టెట్ లేక పోతే జవాబుదారీతనం ఉండదని భావించకూడదు.
సమతుల్య విధానం అవసరం
ఉపాధ్యాయులకు తగిన వృత్తిపరమైన మద్దతు, మార్గదర్శ కత్వం లభిస్తున్నాయా అనే దానిపై దృష్టి పెట్టడం మెరుగైన వ్యవస్థ లక్షణం. టెట్‌ను కొనసాగించడంతో పాటు, ఉపాధ్యాయుల వృత్తి పరమైన ప్రమాణాలను కాపాడే ఇతర మార్గాలను కూడా అనుసరించవచ్చు. సమతుల్యమైన విధానంలో మూడు అంశాలు ఉండవచ్చు. మొదటిది, కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి టెట్‌ను భవిష్యత్తులో వర్తించే అర్హతగా కొనసాగించాలి. రెండవది, 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు చట్టపరంగా ప్రత్యేక రక్షణ కల్పించే నిబంధనను పరిగణించాలి. వారి సేవ కొనసాగింపును రక్షించడంతో పాటు, తగిన వృత్తిపరమైన జవాబుదారీతనాన్ని కొనసాగించాలి. మూడవది, ఉపాధ్యాయుల కోసం మార్గదర్శకత్వం, సహచరుల ద్వారా అభ్యాసం, తరగతి గది బోధనలో సహాయం, నిరంతర అభ్యాసం ఆధారంగా బలమైనవృత్తిపరమైన అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
అందువల్ల, తమిళనాడు తీర్మానం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు ఒక అవకాశంగా నిలుస్తుంది. భారతదేశానికి సమర్థులైన, జవాబుదారీ ఉపాధ్యాయులు అవసరం. అయితే వృత్తిపరమైన సామర్థ్యం ఒక్కసారిగా ఏర్పడదు. అది శిక్షణ, అనుభవం, సహ కారం, విశ్వాసం, సంస్థాగత మద్దతు ద్వారా కాలక్రమంలోఅభివృద్ధి చెందుతుంది. ఒక పరీక్ష అర్హతను నిర్ధారించగలదు. కానీ అది ఒక్కటే వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించలేదు.
టెట్: ఇది వృత్తిపరమైన ప్రమాణాలకు వ్యతిరేకమైన వాదన కాదు. ప్రస్తుత సర్వీస్ నిబంధనలనువెనుకటి తేదీ నుంచి రుద్దకూడదన్న వాదన.

-వ్యాసకర్త లెక్చరర్, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హన్మకొండ
-ఎడమ శ్రీనివాస రెడ్డి


