ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో డెమోక్ర టిక్ పార్టీ, యూఎస్ కాంగ్రెస్‌కు చెందిన రెండు సభలైన హౌజ్ ఆఫ్ రిప్రజెంటే టివ్స్, సెనేట్‌లలో స్పష్టమైన మెజారిటీని సాధించింది. రిపబ్లికన్ పార్టీకి కంచుకోట లుగా ఉన్న టెక్సాస్, ఒహాయో, కరోలినా రాష్ట్రాలలో కూడా నీలి సునామీ ఏర్పడింది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కావడం వలన పార్లమెంటులో మెజారిటీ కోల్పోయినా, ట్రంప్ అధ్యక్ష పదవికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ రాజకీయంగా ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ.
పదవికి ముప్పు లేదు కానీ...
యూఎస్ కాంగ్రెస్‌కు చెందిన రెండు సభలలో డెమోక్రాట్లు మెజారిటీ సాధించటంతో ట్రంప్ ప్రభుత్వం డెమోక్రాట్ల మద్దతు లేకుండా బిల్లులు పాస్ చేయించుకోలేదు. ట్రంప్ తన అధికారాలను ఉపయోగించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేస్తూ పాలన కొనసాగించాలి. మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు బిల్లులను కాంగ్రెస్‌లో పాస్ చేసినా... అధ్యక్షుని ఆమోదం దశలో ట్రంప్ వాటిని వీటో చేయ వచ్చు. అధ్యక్షుడు, ఇతర మంత్రులను పదవిలో నుండి తొలగించ టానికి అభిశంసన (ఇంపీచ్‌మెంట్) తీర్మానాలను పాస్ చేసినా అవి అమలులోకి రావటానికి (కన్విక్షన్) కావల్సిన మూడింట రెండువంతుల మెజారిటీ డెమోక్రాట్లకు లేదు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ జనవరి మూడవ తేదీ తరువాత కాంగ్రెస్‌లో తన మెజారిటీ ద్వారా ఏం చేయబోతున్నదనేది పరిశీలిద్దాం.
కీలక అంశాలు, విధానాలపై డెమోక్రటిక్ పార్టీ విస్తృతంగా విచారణలను మొదలుపెట్టవచ్చు. వ్యక్తులను కాంగ్రెస్ ముందుకు పిలిపించుకోవచ్చు. అధికారిక పత్రాలను, రికార్డులను తనముందుకు రప్పించుకోవచ్చు. ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ విధానంపై విచారణ ప్రారంభించవచ్చు. ట్రంప్ కుటుంబ సంస్థలు, వ్యాపారాలు, ఆస్తులు, అవినీతి అంశాలపై విచారణ చేయవచ్చు. ముఖ్యంగా ట్రంప్ కుమారులు ప్రారంభించిన ‘వరల్డ్ లిబర్టీ ఫైనా న్సియల్స్’ వంటి సంస్థలపై గురిపెట్టవచ్చు. ట్రంప్ సన్నిహితులైన హెగ్‌సెత్, వీట్‌కాఫ్, ఎలాన్ మస్క్ విచారణలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇవన్నీ ట్రంప్‌కు వ్యక్తిగతంగా కంటే రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరం. రిపబ్లికన్ పార్టీ నుండి తదుపరి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయగోరుతున్న జె.డి.వాన్స్, మార్క్ రూబియో వంటి యువ రిపబ్లికన్ నాయకులకు ఇది ప్రతికూలం. ఈ విషయంలో వాన్స్ కొంత ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడు. రిపబ్లి కన్ల ఓటమికి ఇరాన్ యుద్ధం కారణమనీ, అంటే పరోక్షంగా ట్రంప్ కారణమనీ పేర్కొన్నాడు. ట్రంప్ తెలివిగా, ఓటమికి వ్యక్తిగతంగా అభ్యర్థులు కారణమనీ, ఇది తన ఓటమి కాదనీ ప్రకటించాడు. మూడవసారి అధ్యక్షుడిగా పోటీ చేయటానికి రాజ్యాంగం ఒప్పు కోదు కాబట్టి ట్రంప్‌కు వచ్చే నష్టమేమీ లేదు.
ఇరాన్ యుద్ధంపై తీర్పా?
యూఎస్ మధ్యంతర ఎన్నికల ఫలితాలను ఇరాన్ యుద్ధంపై తీర్పుగా భావించాలా అంటే, బహుశా కాకపోవచ్చు. అమెరికన్ ప్రజలు ముఖ్యంగా పెరిగిన గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల వలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ధరలు పెరగ టానికి ఇరాన్ యుద్ధం పరోక్షంగా కారణం. ఈ విషయాన్నిగ్రహించే ట్రంప్ ఎన్నికలకు ముందు చమురు ధరలు తగ్గించటానికి ఆఖరికి రష్యా నుండి డీజిల్ కొనుగోలుకు పచ్చజెండా ఊపాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆర్థికేతర ప్రభుత్వ విధానాలలో ప్రజ లను రిపబ్లికన్లకు వ్యతిరేకం చేసిన అంశం ఐస్ (ఐసీఈ) ఏజెంట్ల దాష్టీకం. ఎప్పటినుండో నివసిస్తున్న లాటిన్ అమెరికన్లను నిర్బంధించటం వ్యతిరేకతను కూడగట్టింది.
ఇరాన్ యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ ప్రకటించాడు. కానీ ట్రంప్ తన మాట మీద ఎప్పుడూ నిలబడలేదు. ఇది ఒక వ్యూహం కావచ్చు. పర్షియన్ సింధు శాఖ జలాలలో ఇరాన్‌ను దిగ్బంధించి నప్పటికీ, కాస్పియన్ సముద్రం, మధ్య ఆసియాల ద్వారా చైనా, రష్యాలతో వాణిజ్య, సైనిక సహాయాన్ని పొందుతూ ఇరాన్ బలీ యంగా కొనసాగుతున్నది. భూమార్గాలను కూడా మూసివేసి ఇరాన్‌ను దారికి తీసుకు రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు.
ఇందులో భాగంగా ‘ఐరన్ గేట్’ను ప్రతిపాదించాడు. కానీ అజర్ బైజాన్, తుర్క్‌మెనిస్తాన్, చైనా, రష్యా దీనికి సహకరించాలి. నవంబర్ 18న షెంజెన్ (చైనా)లో జరగబోయే అపెక్ (ఏసియా పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్) శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని జిన్‌పింగ్, పుతిన్‌లతో చర్చించాలని భావిస్తున్నాడు.
ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాల ప్రభావం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 61 మంది అవసరం కాగా... నెతన్యాహూ కూటమి ఇజ్రాయెల్ ఎన్నికలలో 53 వద్ద ఆగిపోయింది. 48 సీట్లను గెల్చుకున్న గాడీ ఐసన్‌కోట్‌ను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాడు. పందొమ్మిది సీట్లు గెల్చుకున్న అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే ఐసన్‌కోట్ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇజ్రాయెల్ చరిత్రలో ఒకేసారి 2021లో అరబ్ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అది కేవలం పద్దెని మిది నెలలు మాత్రమే మనగలిగింది.
గాజా యుద్ధం నేపథ్యంలో అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే ఐసన్‌కోట్ కూటమిలోని కొన్ని పార్టీలు బయటకు వెళ్లి పోవచ్చును. అందుకే నెతన్యాహూ అన్ని జియోనిస్టు పార్టీలతో కూడిన జాతీయ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాడు. ఇజ్రాయెల్‌కు అమెరికా అతిగా సైనిక మద్దతునివ్వటాన్ని అమెరికన్ ప్రజలు కొంతవరకు వ్యతిరేకిస్తు న్నారు. అందుకే మధ్యంతర ఎన్నికల రోజున ఈ సంవత్సరానికి ఇజ్రాయెల్‌కు ఇచ్చే సైనిక సహాయాన్ని నిలిపి వేయబోతున్నట్లుగా ట్రంప్ ప్రకటించాడు. అయితే డెమోక్రాట్లలో కూడా ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతునిచ్చే వర్గం బలంగానే ఉన్నది.
ట్రంప్ మొదటి నుండీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు గట్టి మద్దతుదారు. ఈ రంగంలో చైనాకు దారివ్వకూడదని పట్టుదలతో ఉన్నాడు. ఏఐ రీసెర్చ్‌ను కొంతకాలం నెమ్మదించాలనే ప్రతిపాద నను ట్రంప్ బాహాటంగానే వ్యతిరేకించాడు. డెమోక్రాట్లు ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. పులి మీద పుట్రలా
ఎన్విడియా చీష్ జెన్సెన్ హవాంగ్ వివాహేతర సంబంధం, హనీట్రాప్ వివాదంలో చిక్కుకోవటంతో అమెరికన్ ఏఐ రంగంలో చైనా గూఢ చారులు ప్రవేశించారనే అనుమానాలొచ్చాయి. దీనితో ప్రధాన టెక్ కంపెనీల షేర్లు దెబ్బతిన్నాయి. ట్రంప్‌కు ఇది అనుకోని దెబ్బ. టెక్ కంపెనీల నాయకత్వంలో బలోపేతమైన అమెరికన్ స్టాక్ మార్కెట్ దెబ్బతింటే, రిపబ్లికన్ పార్టీకి గడ్డుకాలమే.
కీలక అంశాలు, విధానాలపై డెమోక్రటిక్ పార్టీ విస్తృతంగా విచారణలను మొదలుపెట్టవచ్చు. ట్రంప్ కుటుంబ సంస్థలు, వ్యాపారాలు, ఆస్తులపై విచారణ చేయవచ్చు.

-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు


