ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ భేటీ.. చరిత్రాత్మక ఘట్టమన్న చైనా | China on Trump, Xi Jinping and Putin first face to face trilateral meet | Sakshi
Sakshi News home page

ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ భేటీ.. చరిత్రాత్మక ఘట్టమన్న చైనా

Nov 16 2026 4:21 PM | Updated on Nov 16 2026 4:29 PM

China on Trump, Xi Jinping and Putin first face to face trilateral meet

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ముఖాముఖి త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 19న చైనాలోని షెన్‌జెన్‌లో జరగనున్న ఈ భేటీ చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినదని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

ప్రపంచ శాంతి పరిరక్షణ, అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వం వంటి అంశాలపై ముగ్గురు నేతలు చర్చించనున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. అంతేకాదు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ మూడు దేశాలకు కీలక బాధ్యత ఉందని పేర్కొన్నారు.

అయితే ఈ సమావేశంలో అణ్వాయుధ నియంత్రణ ప్రధాన అజెండాగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్యను తగ్గించే అంశంపై ట్రంప్ చర్చించనున్నట్లు ఇప్పటికే వైట్‌హౌస్ వెల్లడించింది. అమెరికా, రష్యా మధ్య చివరిగా మిగిలిన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ 2026 ఫిబ్రవరిలో ముగియడంతో ఈ చర్చలకు ప్రాధాన్యత పెరిగింది.

అలాగే ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. అయితే ఈ అంశాలపై అధికారిక అజెండాను మాత్రం చైనా ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ భేటీతో అణ్వాయుధ నియంత్రణపై చర్చలకు కొత్త మార్గం ఏర్పడుతుందని అంతర్జాతీయంగా అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement