భారత్‌పై మళ్లీ టారిఫ్‌ల మోత !! | US set to raise tariffs on India and China | Sakshi
Sakshi News home page

భారత్‌పై మళ్లీ టారిఫ్‌ల మోత !!

Nov 25 2026 1:52 AM | Updated on Nov 25 2026 1:52 AM

 US set to raise tariffs on India and China

చైనాసహా పలు దేశాలపై పెంచాలని  అమెరికా యోచన

వాషింగ్టన్‌: భారత్‌కు ఆత్మియ నేస్తానంటూ గొప్పలు చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు టారిఫ్‌ల సుత్తితో మోదేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలనాత్మక కథనం ప్రచురించింది. కథనంలోని వివరాల ప్రకారం భారత్, చైనా సహా పలు దేశాలపై ఈ వారంలోగా అదనపు టారిఫ్‌ల భారాన్ని అమెరికా మోపే ఆస్కారముంది. 

అమెరికా కంపెనీల ప్రయోజనాలను దెబ్బతీసేలా దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు భారత్‌ కృషిచేసిందని అమెరికా ఆరోపిస్తోంది. మార్చి 11వ తేదీ తర్వాత అమెరికా చేపట్టిన ఒక అంతర్గత దర్యాప్తులో ఈ విషయం తేలినట్లు తెలుస్తోంది.

పారదర్శకత లోపించిన వాణిజ్య విధానాలతో తమ దేశానికి ఇబ్బంది కలిగితే అది 1974 వాణిజ్య చట్టంలోని 301వ సెక్షన్‌ ప్రకారం నేరమని అమెరికా వాదిస్తోంది. అయితే ఎంత శాతం టారిఫ్‌లు విధిస్తారు? అనే దానిపై స్పష్టతలేదు.  అమెరికాతో తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్‌ చర్చలు జరుపుతున్న వేళ టారిఫ్‌ బాంబు పేలొచ్చని వార్తలు రావడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement