మూడు దేశాల వింత వైఖరి | Sakshi Guest columns on Trump and Xi Jinping and Putin hold historic first trilateral summit in China | Sakshi
Sakshi News home page

మూడు దేశాల వింత వైఖరి

Nov 24 2026 12:48 AM | Updated on Nov 24 2026 12:48 AM

Sakshi Guest columns on Trump and Xi Jinping and Putin hold historic first trilateral summit in China

షెన్‌జెన్‌ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌

  అమెరికా, చైనా, రష్యా– మూడు దేశాల శిఖరాగ్ర సమావేశం ఓ వింతకాగా, వాటి ప్రకటనలో స్పష్టత లేదు. ఆశయాలు పొసగనివి. అవి సందర్భానుసారంగానూ లేవు, సమర్థించుకోదగినవిగానూ లేవు.

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఆతిథేయిగా వ్యవహరించిన షెన్‌జెన్‌ త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సు వింతగొలిపే పరిణామమే. నవంబర్‌ 19న జరిగిన ఈ సమావేశంలో అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పాల్గొన్నారు. ఆసియా–పసిఫిక్‌ సహకార సంస్థ (అపెక్‌)  సందర్భంలో ఇది చోటు చేసుకుంది. 

తన గడ్డపై, తాను నిర్ణయించిన అంశాలపై చర్చకు అమెరికా, రష్యాలను కూర్చోబెట్టగలిగిన శక్తిమంతమైన దేశంగా చాటుకునేందుకు చైనాకు ఇది ఒక అవకాశం కల్పించింది. శాంతిదూతగా చాటుకునేందుకు ఇది ట్రంప్‌కు వీలు కల్పించింది. పుతిన్, జిన్‌పింగ్‌ పట్ల ఆయన బాహాటంగానే అభిమానాన్ని వ్యక్తపరిచారు. పుతిన్‌ విషయానికొస్తే, పాశ్చాత్య దేశాలు ఆయన్ని ఇప్పటికీ అంట రానివాడిగానే చూస్తున్నాయి. ఈ సదస్సులో పాల్గొ నడం ద్వారా తాను ఏకాకిని కానని ఆయన చాటుకున్నారు.

శాంతి ముసుగు
ఇలా ముగ్గురి అనివార్యతలు వేరుగా ఉన్నాయి. ఈ సదస్సు ఫలితం మితమైనది కానీ విస్తృతమైన పరిధి కలిగినది. ఉక్రెయిన్‌తో రష్యా, ఇరాన్‌తో అమెరికా తలపడుతున్నాయి. తైవాన్‌ తనదేనని చైనా పట్టుబడుతోంది. ఈ మూడు దేశాల నాయకులు ప్రపంచ శాంతిపై ప్రకటన విడుదల చేయడం వింతల్లోకెల్లా వింత. మూడు దేశాల మధ్య సామ్యం ఏదైనా ఉందీ అంటే, అది పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలను కలిగి ఉండడమే. అంతర్జాతీయ చట్టా లను, నియమాలను ఉల్లంఘించి సైనిక శక్తిని ప్రయోగించిన కళంకం మూడింటికీ ఉంది.

ప్రపంచాన్ని ఓ దారికి తెచ్చే హక్కును తమకు తామే కట్టబెట్టేసుకుని, ప్రపంచ శాంతికి ఓ విరుగుడును అవి సూచించాయి. ఐక్యరాజ్య సమితికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అవి ఆ పని చేశాయి. ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన మరో రెండింటిని (ఫ్రాన్స్, బ్రిటన్‌) లెక్కలోకి తీసుకోకుండానే ఐరాస పునర్వవ్యవస్థీకరణ ఆవశ్యకత గురించి మాట్లాడాయి. ఇతర ప్రధాన దేశాల ఊసు ఎత్తలేదు. యూరోపియన్‌ యూనియ న్‌ను విస్మరించాయి. వ్యవస్థను విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవ స్థను చక్కదిద్దే బాధ్యతను భుజాలకెత్తుకోవడం విడ్డూరం కాదా? 

అణ్వాయుధ నిషేధం జరిగేనా?
సంయుక్త ప్రకటనలోని నాలుగు అంశాలు సాపేక్షంగా వేటికవే భిన్నమైనవి. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తే, భారతదేశానికి సంబం
ధించి నిర్దిష్ట ప్రాధాన్యం కలిగినవిగా తేలుతుంది. మొదటగా, ‘అణ్వాయుధాలతో యుద్ధాన్ని గెలవలేం. వాటితో యుద్ధానికి ఎన్నడూ దిగకూడదు’ అంటూ సుద్దులు చెప్పాయి. నిజానికి, అణ్వస్త్రాలను అంతర్జాతీయంగా పూర్తిగా నిర్మూలించాలని భారత్‌ 1988లోనే సూచించింది.

అణ్వాయుధ రహిత, అహింసా యుత ప్రపంచ వ్యవస్థ దిశగా కార్యాచరణ ప్రణాళిక అంటూ అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ 1988 జూన్‌లో ఐరాస సర్వ ప్రతినిధి సభకు ఒక పత్రాన్ని సమర్పించారు. తనిఖీలతో, దశలవారీగా 2010 నాటికి ఆ పని పూర్తి చేయాలని రాజీవ్‌ పిలుపునిచ్చారు. కాకపోతే, 1998 తర్వాత, ఆత్మరక్షణ నిమిత్తం అది స్వీయ పరిమిత పాటవ అణ్వ స్త్రాన్ని తయారు చేసుకుంది. అణ్వాయుధాలను ఒక వేలాడదీసిన కత్తిగా ఉపయోగించకూడదనీ, వాటిని సమగ్రంగా నిషేధించాలనీ, పూర్తిగా నిర్మూలించాలనీ జిన్‌పింగ్‌ చేసిన సూచన, భారత్‌

వైఖరితో సరిపోయేదిగానే ఉంది.
ఈ అంశంపై చర్చలు జరపాలన్న త్రైపాక్షిక సంకల్ప పత్రంపై చైనా సంతకం చేయడం ఈసారి కనిపించిన కొత్త అంశం. అమెరికా, రష్యా రెండింటివద్ద కలిపి 5,000 పైచిలుకు అణ్వస్త్ర నిల్వలు ఉన్న సమయంలో చైనా వద్ద 620 అణ్వాయుధాలే ఉన్నాయి. అప్పట్లో ఎలాంటి త్రైపాక్షిక చట్రంలోనైనా ఇమిడేందుకు చైనా తిరస్కరిస్తూ వచ్చింది. కనుక, ఇది రాయితీ కిందకు రాదు. పూర్వ ప్రమాణాన్ని అనుసరించింది అంతే. అణ్వాయుధాలు ఉన్నదీ లేనిదీ తనిఖీకి అను మతించాలనీ, మిగిలిన ప్రపంచానికంతటికీ ఈ మూడు దేశాల క్లబ్‌ నియమాలను నిర్దేశించకూడదనీ భారత్‌ స్పష్టం చేయాలి. 1988 నుంచి చెబుతూ వస్తున్న వైఖరిని కొనసాగించాలి. 

పి–3 ప్రాజెక్టుగా మారుతుందా?
ఐరాస (ఐక్యరాజ్యసమితి) సంస్కరణ రెండవ అంశం. దానికి తాము కట్టుబడి ఉన్నామని మూడు దేశాలు చెప్పుకున్నాయి. అప్పుడే అంతర్జాతీయ సవాళ్ళను ఐరాస సమర్థంగా ఎదుర్కో గలుగుతుందని చెప్పాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇది విచిత్రమైన సూత్రీకరణే. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాలనీ, శాశ్వత, తాత్కా లిక శాశ్వత  కేటగిరీలు రెండింటినీ విస్తరించాలనీ భారత్‌ దశా బ్దాలుగా కోరుతోంది.

షెన్‌జెన్‌ ప్రతిపాదన ఆ మూడు దేశాలు తమ కోసం తాము చేసుకుంటున్న సంస్కరణగా ఉంది తప్ప సంస్థ ప్రజా స్వామికీకరణకు తోడ్పడేదిగా లేదు. న్యూఢిల్లీ దీన్ని హెచ్చరికగా తీసుకోవాలి. ఐరాస సంస్కరణ పి–3 ప్రాజెక్టుగా పరిమితమైతే భారత్‌ కంఠశోష పనికిరానిదిగా మారుతుంది. ఎటువంటి త్రైపాక్షిక ప్రకటన అయినా, వివిధ ప్రభుత్వాల మధ్య సాగే చర్చలకు ప్రత్యామ్నాయం కానేరదని భారత్‌ తెగేసి చెప్పాలి. 

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) ప్రస్తావన మూడవ
అంశం. ఇది నిస్సిగ్గుగా ఆ మూడింటి స్వప్రయోజనాలను మాత్రమే నెరవేర్చేదిగా ఉంది. ఈ మూడూ ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాలు కావు. అయినా, అంతర్జాతీయ న్యాయ పరిధి గురించి ప్రకటన విడు దల చేసే సాహసానికి దిగాయి. నీ హద్దుల్లో నువ్వుండమని ఐసీసీని ఒక రకంగా బెదిరించడం ఇది. ధక్షిణ చైనా సముద్రంలో చైనా ఇష్టం వచ్చినట్లు నడచుకుంటుంది; కానీ, నియమాల ఆధారిత వ్యవస్థ గురించి మాట్లాడుతుందని షెన్‌జెన్‌ సూచిస్తోందా? 

భారత్‌ కూడా ఐసీసీ సభ్యురాలు కాదుగానీ, సాగర జలాల్లో పాటించవలసిన అంతర్జాతీయ నియమ నిబంధనలపై ఐరాస పేర్కొనే వాటిని స్థిరంగా బలపరుస్తూ వస్తోంది. దక్షిణ చైనా అవా ర్డును అది ఒక చట్టంగానే గౌరవిస్తోంది. కనుక, వాటి ప్రవర్తనతో మనను పోల్చుకోవడానికి లేదు. ఆసియాలో నియమ ఆధారిత వ్యవస్థను కాపాడేందుకు మనకు ఐసీసీ అవసరం లేదు. ఐరాస నియమావళిని పాటిస్తే చాలు. 

సంయుక్త ప్రకటనలో చివరి అంశం శుద్ధి చేసిన పెట్రోలియానికి సంబంధించింది. మన ముడి చమురులో 85 శాతం పైగా దిగుమతి చేసుకుంటున్నదే. హార్మూజ్‌ అవరోధాలు మనకు సుదూర యుద్ధం కిందకు రావు. హార్మూజ్‌ మూసివేత తమను కూడా దెబ్బతీస్తుందని మూడు దేశాలు అర్థం చేసుకోబట్టే స్థిరమైన ఇంధన సరఫరాలకు భరోసా కల్పిస్తామని అవి చెబుతున్నాయి. 
అయితే, వాటి వాగ్దానాన్ని భారత్‌ గ్యారంటీగా తీసుకోవడానికి లేదు. ఆ మాటలను అమలుపరచే యంత్రాంగం లేదు.

సంయుక్త గస్తీ అంతకంటే లేదు. తగినన్ని పెట్రోలియం నిల్వలు ఉంచుకుంటూ, సరఫరాలకు భిన్న దేశాలపై ఆధారపడుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే భారత్‌కు ఉపయోగం. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ నుంచి మలక్కా జలసంధి వరకు నౌకాదళాన్ని కాపలాగా పెట్టడమే మంచిది. ‘క్వాడ్‌’ (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా) సాగర నిఘా గస్తీ గురించి మనీలాలో ఇటీవల ఓ ప్రక టన విడుదల చేసింది. వచ్చే ఏడాది (2027లో) పి–8 దేశాల విమా నాలు కలసి గస్తీ తిరుగుతాయని పేర్కొంది. షెన్‌జెన్‌ వాగ్దానంకన్నా భారత్‌ ఇంధన భద్రతకు ఇదే ఎక్కువ భరోసానిస్తుంది.

వ్యాసకర్త ‘సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌’ డైరెక్టర్, న్యూఢిల్లీ
సి. ఉదయ్‌ భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement