పుతిన్ ముందు చిందేసిన రోబో | Russian Humanoid Robot Green Dances Before Vladimir Putin, Earlier Debut Ends In On-Stage Fall, Video Viral | Sakshi
Sakshi News home page

పుతిన్ ముందు చిందేసిన రోబో

Nov 20 2025 4:38 PM | Updated on Nov 20 2025 5:12 PM

Robot Dance Front of Russia President Vladimir Putin

టెక్నాలజీ పెరుగుతోంది.. ఈ తరుణంలో ప్రపంచంలోని చాలాదేశాలు హ్యుమానాయిడ్ రోబోలను తయారు చేసేపనిలో నిమగమయ్యాయి. ఇందులో రష్యా కూడా ఉంది. ఇటీవల స్బెర్‌బ్యాంక్ బుధవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక రోబో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యాలోని స్బెర్‌బ్యాంక్ తన సాంకేతిక పురోగతిని ప్రదర్శించడానికి రూపొందించిన ప్రదర్శనలో.. బుధవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదురుగా ఒక రోబో డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో.. క్రెమ్లిన్ చీఫ్, హ్యూమనాయిడ్ రోబోట్ ఎదురుగా నిలబడి రోబో గురించి వివరించారు.

రోబో తనను తాను పరిచయం చేసుకుంటూ.. ''నా పేరు గ్రీన్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన మొదటి రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. నేను కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు. టెక్నాలజీ యొక్క భౌతిక స్వరూపిని. నేను డ్యాన్స్ కూడా చేయగలను, అని వ్లాదిమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది''. దాని డ్యాన్స్ చూసి ఆయన ఎంతో ముగ్దుడయ్యాడు.

వేదికపై పడిపోయిన రోబో
నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా 'ఐడల్' (Aidol) అనే రోబోను ఆవిష్కరించారు. ఇది ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చి.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement