టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.
రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.
ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్, కంట్రోల్ సాఫ్ట్‌వేర్ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.
Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.
The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025
హ్యుమానాయిడ్ రోబోలు
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.
మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి.


